ఎన్టీఆర్ ప్రస్థావనే నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగు దేశం పార్టీ కొంపముంచనుందా? ఎన్టీఆర్ కథానాయకుడు పుణ్యమా! అని ఒక వైపు రాం గోపాల్ వర్మ తన సినిమా లక్ష్మీస్ ఎన్ టీ ఆర్ అంటూ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటూ ఆయన జీవితంలో తుది ఘడియలను ఫోకస్ చేస్తుంటే - ఎన్టీఆర్ తో కలసి తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపక సమయం నుండి పని చేసిన మాజీ ముఖ్యమంత్రి నాదేళ్ళ భాస్కరరావు - అనేక చిన్న పెద్ద యూట్యూబ్ చానల్స్ లో ఎన్ టీఆర్ చంద్రబాబు నందమూరి కుటుంబసభ్యులు ఆయనకు పొడిచిన వెన్నుపోటు  ఉదంతం, ఆతరవాత ఆయన లక్ష్మిపార్వతితో జీవితం ఎందుకు పంచుకోవలసి వచ్చిందో వివరిస్తూ ఆయన చివరిరోజులు ఎంతదయనీయంగా గడిచాయో తదితర విషయాలను స్పృజిస్తూ మరణం వరకు సాంగో పాంగంగా పార్టులు-పార్టులుగా వందల్లో ఇంటర్వ్యూలు విదుదల చేస్తూ వస్తున్నారు.
Related image
ఇప్పుడు ప్రభుత్వం ప్రకటిస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను గతంలో ఎందుకు ప్రకటించలేదు? ఇప్పుడు అనేక ప్రోజెక్టులకుచెసే శంకుస్థాపనలు ఎన్నికల ముందు హడావిడిగా చేయట మెందుకు? ఎన్నికలలో గెలుపు కోసం వెసే నాటకాలే కదా! అని అంటున్నారు ప్రజలు. ఈ ప్రోజెక్టులకు బడ్జెట్ లో నిధుల ప్రస్థావన, కేటాయిపులు లేకుండా చేసే ప్రారంభొత్సవాలు శంకుస్థాపనలు అన్నీ నాటకాలు, సినిమా వేషాలు మాత్రమే నంటున్నారు.  మామ నే నిర్ధాక్షిణ్యంగా వంచించి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నూతన రూపు సంతరించుకున్న తెలుగు దేశం పార్టీకి ఈ నాటకాలు తొలి నుంచీ అలవాటేనని అంటున్నారు. 
Image result for NTR had been back stabbed
నాలుగున్నరేళ్ళు నాటకాలేసి ఇప్పుడు ముంగిట్లో ఎన్నికలున్న తరుణంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న కష్టాలకు, ఇబ్బందులకు ప్రధాని నరేంద్ర మోదీయే కారణం. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో పోరాడి బీజేపీ నేతలకు తగిన బుద్ధి చెబుతాం! కేసీఆర్‌, జగన్‌ కలిసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, నన్నూ ఏమీ చేయలేరు అని ముఖ్యమంత్రి చంద్రబాబు డంబాలు పలకటం ప్రజల కు రుచించటం లేదు. 
Image result for NTR had been back stabbed
అక్కడ సెంటిమెంట్‌ గురించి మాట్లాడుతూ, ఇక్కడ కులాల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అని ఆయన కేసీఆర్ ను నిందించే మాటలు చంద్రబాబుపై బూమరాంగ్ అవుతున్నాయి. కులం కోసం కుల జనుల కోసం రాష్ట్రాన్ని దోచి ఒక రాజధాని ప్రాంతాన్నే కట్టబెట్టిన మీరు కులం గురించి కులాల మద్య చిచ్చు పెట్టటం గురించి మాట్లాడటం న్యాయమా? అంటూ బహిరంగంగానే జనం ప్రశ్నిస్తున్నారు. మీరింత ఇంత నీచమా! అని ఎక్కడ దొరికితే అక్కడ ప్రజలు టిడిపి ప్రజాప్రతినిధులపై ధ్వజమెత్తుతున్నారు.
Image result for NTR had been back stabbed
వీటితో పాటు అగ్నికి ఆజ్యం పోసినట్లు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై ప్రభుత్వం, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు అమానవీయంగా స్పందించటం ప్రజల్లో ఒక రకంగా చంద్రబాబు పై ఏహ్యభావం పెంచింది. ఇంకా ప్రమాదకరమైన విషయమేమంటే ఎన్ఐఏ విచారణను ప్రభుత్వం అడ్దుకోవటానికి సిద్ధమవటం - కేంద్ర విచారణ సంస్థలను రాష్ట్ర ప్రవేశానికి నిరోధించటం - వీటికి ముందే చంద్రబాబు అనుయాయులు సిఎం రమేష్, సుజానా చౌదరి, బీద మస్తాన్ రావులపై ఆదాయపన్ను దాడుల్లో దొరికిన లెక్కచెప్పని పన్నుఎగవేతతో పోగుపడ్ద వందల కోట్ల రూపాయిల ప్రజాధనం పాపాల పాముల పుట్ట పగిలినట్లు పగిలి బహిర్గతమవటం ప్రజలు గమనిస్తున్నారు. 
Image result for NTR had been back stabbed
వీటికి పై పెచ్చు తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో మనకు చెందని విడిపోయిన తెలంగాణా  రాష్ట్ర రాజకీయాల్లో వెలుపెట్టి - టిడిపి జన్మపరంగా సిద్ధాంతపరంగా తన పొడే పొసగని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోని - అక్కడ ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ తో కుమ్మక్కై పచ్చమీడియాతో కలసి మోసపూరిత సర్వే చేయించి ప్రజా కూటమిని ఏట్లోకట్ల గెలిపించటానికి చంద్ర బాబు ప్రయత్నించటం తెలంగాణా జనంలో క్రోధాగ్ని చెలరేగేలా చేసి, చివరకు టిడిపికి ధారుణ పరాభవం మూటగట్టి ఇచ్చింది. ఇప్పుడు ఆ కక్ష తీర్చుకోవటానికి కేసీఆర్ & కో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో  వెలే కాదు కాలు పెడతాం అంటూ తలసాని ద్వారా అమరావతి నడిబొడ్డున అమ్మవారి సమక్షంలో చాలంజ్ చేయించేశారు. ఆంధ్ర ప్రదేశ్  ప్రజలు చంద్రబాబు రెచ్చ గొట్టినా రెచ్చి పోవట్లేదు సరికదా! కేసీఆర్ కు మద్దతు ప్రకటించేలా ఉన్నారు. 
Image result for NTR back stabbed by chandrababu
చంద్రబాబు ప్రవర్తనతో ఆవగింజంత కేసీఆర్ హిమోన్నతమంత అయ్యే దాఖలాలు కనిపిస్తున్నాయి. ప్రజలందరూ ఎన్టీఆర్ కు - చంద్రబాబు, నందమూరి & కో  వేసిన వెన్నుపోట వేటూ చూశారు. అసలు కథ తెలియని ఇప్పటి యువతకు పెద్దలు సినిమా కథలా వినిపిస్తూ ఎన్ టీఆర్ కథానాయకుడు అంతా ఉత్తుత్తి సోది అని ఎన్టీఆర్ గొప్పోడేకాని సినిమాలో చూపినంత ఉదార స్వభావుడు కాదని ఆయన సినిమారంగంలో పైకెక్కుతుంటే క్రిందపడి నలిగి పోయిన నటీనటులు చాలామంది ఉన్నారని చెపుతూనే ఉన్నారు. వీళ్ళు తెలుసుకుంటూనే ఉన్నారు   
Image result for NTR back stabbed by chandrababu
ఓటుకు నోటు కేసులో లంచం ఇవ్వజూపి పట్టుబడ్ద ముఖ్యమంత్రిని కనులారా మై గాడ్ అంటూ చూసారు ప్రజలు. పదేళ్ళు హైదరాబాద్ ను జాయింటు రాజధానిగా వాడుకొనే లక్షలకోట్ల ప్రయోజనాన్ని, అవకాశాన్ని రాత్రికి రాత్రి గజనీ మహమ్మద్ లాగా మంది మార్భలంతో పారిపోయి అమరావతి వచ్చి చేరిన చంద్రబాబును నిబిడాశ్చర్యంతో చూశారు ప్రజలు. కేంద్రం నుండి తమ రాజధానిని అద్భుతంగా ప్రణాళికా బద్దంగా నిర్మించుకునే వరకు ఓపిక పట్టలేని దుర్మార్గాన్ని క్షమించలేక చంద్రబాబుకు టిడిపికి వ్యతిరేఖంగా ఓటెయ్యటానికి నిరీక్షిస్తున్నారు కులాల వారిగా ప్రజలు అని తలసాని ఏపిలో ప్రజాభిప్రాయాన్ని సేకరించే చెప్పారట. 
Image result for NTR back stabbed by chandrababu
ప్రత్యేకహోదా కంటే ప్రత్యేకపాకేజీ గొప్పదని శాసనసభలో ముఖ్యమంత్రే చేసిన తీర్మానాలు సన్మానాలు ప్రకటించిన ప్రకటనలు ఇంకా కనిపిస్తూనే ఉండగా నాలుక మడతేసి యూటర్న్ తీసుకొని ప్రత్యేకహోదా కోసం ధర్మపోరాటం న్యాయపోరాటం అంటూ ముఖ్యమంత్రి అయిఉండి ఉద్యమాలు చేసిన చారిత్రక సత్యాన్ని ప్రజలు చుస్తూనే ఉన్నా ఇక  మరువగలరా ? ఇవన్నీ,  వీటితో పాటు వేలకోట్లలో చేసిన దుబారా వ్యయం చంద్రబాబుకు టిడిపికి రాజకీయంగా ప్రాణసంకటంగా మారనున్నాయని అంటున్నారు విశ్లేషకులు. 
Image result for special status to ap
కేంద్రంతో నిందించి పోరాడి సంపాదించిన దావోస్ పర్యటన అనుమతిని కూడా రద్ధు చేసుకొనే పరిస్థితులు ముప్పిరిగొని చంద్రబాబుపై ముప్పేటదాడి చెయనున్నాయా? పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. స్వయంకృతాపరాధానికి టిడిపి మూల్యం చెల్లించుకోకతప్పదని తెలుస్తుంది. చివరకు శాసనసభలో మంత్రి మండలిలో అతి చిన్నవస్కురాలైన, భూమా అఖిల ప్రియ కూడా ముఖ్యమంత్రిని వణికించిందంటే టిడిపిలో ఏం? జరుగుతుందనేది ప్రజా సమూహాల్లో ప్రధాన  చర్చనీయాంశం అవుతుంది 

Image result for special status to ap  

మరింత సమాచారం తెలుసుకోండి: