జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి నేత హర్షవర్ధన్ చౌదరి బ్రీఫింగ్ తర్వాతే విచారణకు హాజరైనట్లు సమాచారం. విచారణలో భాగంగా ఎన్ఐఏ చాలామందికి నోటీసులిచ్చింది. అందులో టిడిపి నేత, ఎయిర్ పోర్టులో క్యాంటిన్ ఓనర్ చౌదరి కూడా ఉన్నారు. నోటీసులందుకున్న వారిలో చాలామంది విచారణకు హాజరయ్యారు. అయితే, చౌదరి మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. ఇదే విషయమై సోషల్ మీడియాలో ఇటు చంద్రబాబునాయుడు మీద అటు చౌదరి మీద సెటైర్లు దుమ్ములేచిపోతున్నాయి. మీడియాలో కూడా ప్రముఖంగా పదే పదే వచ్చింది.

 Image result for jagan attack

అసలే హత్యాయత్నం ఘటనలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దానికి తోడు షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తోంది. ఇటువంటి సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి నేత హాజరుకాకుండా పరారైతే నెగిటివ్ అవుతుందని టిడిపిలోని కీలక వ్యక్తుల్లో ఆందోళన మొదలైందట. హత్యాయత్నం కేసులో ఇప్పటికే వైసిపి నేరుగా చంద్రబాబును సూత్రదారుగా బాహాటంగానే ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. కత్తితో దాడి చేసిన శ్రీనివాస్ కేవలం పాత్రదారుడు మాత్రమే అని అసలు సూత్రదారులు చౌదరి, చంద్రబాబు అండ్ కో అంటూ వైసిపి నేతలు పదే పదే మండిపడుతున్నారు.

 Image result for jagan attack

దాంతో తమను తాము సెల్ఫ్ డిఫెన్స్ కోసం టిడిపిలోని కీలక వ్యక్తులు  చౌదరిని ముందుగా తమ వద్దకు పిలిపించుకుని ఎన్ఐఏ విచారణలో చెప్పాల్సిన విషయాలు, ఏ విధంగా మాట్లాడాలన్న అంశాలపై బ్రీఫింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఆ బ్రీఫింగ్ కోసమే నాలుగు రోజులుగా చౌదరి తప్పించుకుని తిరుగుతున్నారట. సరే మొత్తానికి బ్రీఫింగ్ పూర్తయిన తర్వాతే చౌదరి ఎన్ఐఏ ఉన్నతాధికారులకు టచ్ లోకి వచ్చారట. దాంతో వెంటనే ఎన్ఐఏ గాజువాకలోని చౌదరి ఇంటికి వెళ్ళి సుమారు గంటకుపైగా విచారించారు. తన కాలుకు దెబ్బ తగిలిన కారణంగానే విచారణకు హాజరు కాలేదని చౌదరి చెప్పటం కథలని అందరికీ అర్ధమైపోతోంది. అందుకే కాలు దెబ్బ తగ్గిన తర్వాత తమ కార్యాలయానికి రమ్మంటూ ఎన్ఐఏ అధికారులు స్పష్టం చేయటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: