అమరావతి నిర్మాణం నేపథ్యంలో పలు ప్రాజెక్టులను ప్రభుత్వం చేపడుతోంది. వీటిలో చాలా వాటిని వివిధ టెండర్ల ద్వారా ఆయా నిర్మాణ కంపెనీలకు కట్టబెడుతోంది. ఐతే.. ఈ నిబంధనలు కొన్ని ప్రముఖ కంపెనీలకు అనుగుణంగానే రూపొందిస్తున్నారని ఓ సాక్షి పత్రిక కథనం వెలువరించింది.

Image result for amaravati construction


ఇప్పటివరకూ అమరావతిలోని 25 వేల కోట్ల రూపాయల పనులకు కేవలం ఐదు కంపెనీలకే కట్టబెట్టినట్టు ఆ పత్రిక కథనం చెబుతోంది. సాధారణంగా ప్రాజెక్టు నిర్మాణానికి అనుగుణంగా నిబంధనలు తయారు చేస్తారు. కానీ ఈ కంపెనీలకు ఉన్న అర్హతలనే టెండర్లలో ప్రస్తావిస్తూ వేరే కంపెనీలకు పనులు దక్కనీయడం లేదని ఆ పత్రిక విశ్లేషించింది.

Image result for amaravati construction


ఈ కంపెనీలు చేపట్టే పనులకు చదరపు అడుగుకు ఏడు వేల రూపాయల నుంచి పది వేల రూపాయల వరకు చెల్లిస్తున్నారట. ప్రతిపాదనల దశలోనే ముఖ్యమంత్రి నోటి మాటతోనే వందల కోట్ల రూపాయల పనుల్ని ఈ సంస్థలు చేజిక్కించుకుంటున్నాయట. కొన్ని కీలక ప్రాజెక్టుల ప్రతిపాదనలను ఆ ఐదు సంస్థలే తయారుచేసి ముఖ్యమంత్రి ఎదుట పెడుతున్నాయట.

Image result for amaravati construction


ఇప్పటివరకూ అమరావతిలో చేపట్టిన పనుల్లో 80 శాతం పనులను L & T, NCC, షాపూర్‌జీ పల్లోంజి, BSR ఇన్‌ఫ్రా కంపెనీలకు కేటాయించారట. మిగిలినవి BSCPL, మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీలకు ఇచ్చారట. ఇప్పటివరకూ ఒక్క L & Tకే 8 వేల కోట్లకు పైగా పనులు దక్కాయటమరి భారీస్థాయి నిర్మాణాలు చేపట్టే సత్తా మిగిలిన కంపెనీలకు లేదా.. లేక.. సత్వర నిర్మాణాల కోసం ఈ కంపెనీలనే ఎంచుకుంటున్నారా.. అన్నది ఆలోచించాల్సిన విషయమే.


మరింత సమాచారం తెలుసుకోండి: