ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ రాజకీయ నేతల విమర్శల్లో లాజిక్ మిస్సవుతోంది. ఇతరులపై దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఇటీవల టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ .. జగన్‌తో భేటీకావడాన్ని కూడా చంద్రబాబు తప్పుబడుతున్నారు. ఇదే సమయంలో వరంగల్ లో తనపై రాళ్లు విసిరిన నేతలతోనే ఇప్పుడు జగన్ చేతులు కలుపుతున్నారని విమర్శించారు.



నిజమే.. వరంగల్‌లో జగన్‌పై టీఆర్‌ఎస్ నేతలు రాళ్లు విసిరారు.. కానీ అది రాష్ట్ర విభజనకు ముందు.. ఇప్పుడు రాష్ట్రవిభజన జరిగిపోయింది. పరిస్థితులు మారిపోయాయి. కానీ చంద్రబాబు ఈ విషయాన్ని గుర్తించడానికి ఇష్టపడుతున్నట్టు లేరు. ఆయన చెప్పిన ప్రకారం చూస్తే.. మరి చంద్రబాబు తన ఆగర్భశత్రువైన కాంగ్రెస్‌తో తెలంగాణలో ఎలా చేతులు కలిపారు.



రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారంటూ సోనియాగాంధీని విమర్శించి రాహుల్ గాంధీని కలసి వీణ బహుకరించి అక్కున ఎలా చేర్చుకున్నారు.. నిన్న మొన్నటి వరకూ ఎన్టీఏ సర్కారులో మంత్రిపదవులు అనుభవించి ఇప్పుడు మోడీని ఎలా విమర్శస్తారు. అంటే చంద్రబాబు గతం మరిచిపోయారా.. అన్న వాదనలు వినిపిస్తున్నాయి.



కోల్ కతాలో జరగనున్న విపక్షాల ర్యాలీకి 20కి పైగా జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు హాజరు అవుతున్నారు. కానీ ఈ భేటీకి కేసీఆర్, జగన్ రావడం లేదు. దీన్ని కూడా చంద్రబాబు రాజకీయ విమర్శలు అవకాశంగా మలచుకున్నారు. వారిద్దరూ మోదీతో ఉన్నారనడానికి ఇదే నిదర్శనమంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: