క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పార్టీ వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి. రానున్న ఎన్నికల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పోటీ చేయాలని రెడీ అవుతున్న సీనియర్ నేత అంబటి రాంబాబుకు పార్టీలో అసమ్మతి సెగ ఒక్కసారిగా కమ్ముకుంటోంది. అంబటి అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీలోని ఓ స్ధాయి నేతల్లో చాలామంది వ్యతిరేకంగా తయారయ్యారు. నియోజకవర్గంలోని మండలాల్లో జోరుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. అంబటిని తీవ్రంగా వ్యతిరేకిస్తు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారంటేనే అంబటిపై ఏ స్ధాయిలో పార్టీలోనే వ్యతిరేకత ఉందో అర్ధమైపోతోంది.

 

సరే అసమ్మతి కార్యక్రమాలు బాహాటంగానే జరుగుతుంటే పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళకుండా ఉంటుందా ? అందుకే ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అంబటి వ్యతిరేక వర్గాన్ని పిలిపించి మాట్లాడారు. అంబటి మీద నియోజకవర్గంలో ఎంత వ్యతిరేకత ఉందో వాళ్ళు వివరించారట. జనాల సంగతి పక్కనపెట్టినా పార్టీలో మాత్రం విపరీతమైన వ్యతిరేకత ఉందని చెప్పారట. పార్టీ నేతలను అంబటి బాగా చులకనగా మాట్లాడుతుండటమే అందుకు ప్రధాన కారణంగా తేల్చి చెప్పారట. అయితే, వచ్చే ఎన్నికల్లో అంబటే పార్టీ అభ్యర్ధిగా విజయసాయి స్పష్టం చేశారట. అంబటిని మార్చే ఉద్దేశ్యంలో జగన్ లేరని కూడా చెప్పారట.

 

అయితే, పార్టీ రాష్ట్రంలో 174 నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేస్తోందని భావించాల్సుంటుందని అసమ్మతి  నేతలు కూడా గట్టిగానే చెప్పారట. పార్టీని నమ్ముకున్న వారిని అంబటి తొక్కేస్తున్నారని, పార్టీ జెండాను మోసిన వారికి కాకుండా మధ్యలో వచ్చిన వారికి మాత్రమే పదవులు కట్టబెడుతున్నట్లు నేతలు కంప్లైంట్ చేశారట. గతంలో సత్తెనపల్లి, రెంటపాళ్ళల్లో నిర్వహించిన సభకు వచ్చిన రెస్పాంస్ గురించి వివరించారట. దాంతో పార్టీ నాయకత్వానికి కూడా విషయం బోధపడిందని సమాచారం. ఎన్నికలకు ముందు సత్తెనపల్లిలో బయటపడిన అసమ్మతిని పార్టీ నాయకత్వం ఏ విధంగా సాల్వ్ చేస్తుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: