రాజకీయాల్లో ఎపుడేం జరుగుతుందో  ఎవరికీ తెలియదు. ఎన్నికలు అనగానే అందరికీ ఓట్లు గుర్తుకువస్తాయి. దాంతోనే రాజకీయమూ సాగుతుంది. ఎత్తులు, పొత్తులు వంటివి అపుడే పుట్టుకువస్తాయి. ప్రస్తుత పాలిటిక్స్ చూస్తూంటే ఓట్ల కోసం ఎన్నో జిమ్మిక్కులు వేయడం కనిపిస్తూంటూంది. ఎత్తుల జిత్తుల వ్యవహారంలో ప్రజలు, అభివ్రుద్ధి అన్నది  ప్రతీసారీ పక్కకు పోతూనే ఉంటుంది. 


పవన్ ఇంటికి బాబు:


సరిగ్గా అయిదేళ్ళ క్రితం ఒకసారి చూస్తే ఏపీ రెండుగా విభజన జరిగింది. నవ్యాంధ్రకు చంద్రబాబు తొలి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. అప్పటికే ఏపీలో వైసీపీ వేవ్ ఓ రేంజిలో ఉంది. అన్ని సర్వేలు కూడా జగన్ దే పీఠం గట్టిగా చెప్పేసిన పరిస్థితి ఉంది. ఆ టైంలో సినిమా నటుడు పవన్ కళ్యాణ్ తాను పార్టీ పెడుతున్నట్లుగా ప్రకటించి సంచలనం సృష్టించారు. పార్టీ పేరు జనసేన అని కూడా ఒక సభలో నిర్ణయించారు. పవన్ సభకు జనమంతా ఎగబడిపోయారు. ఫ్రెష్ గా రాజకీయాల్లోకి రావడంతో పాటు యూత్ కి కనెక్ట్ అయి ఉన్న పవన్ పార్టీ పెడితే ఏపీలో మూడేది అచ్చంగా టీడీపీకే.
Image result for tdp janasena

ఈ సంగతి అందరి కన్నా ముందు తెలుసుకున్న చంద్రబాబు అనూహ్యంగా పవన్ ఇంటి ముంగిట వచ్చి వాలిపోయారు. పవన్ సైతం ఆలోచించని ఘటన ఇది.  పవన్ కళ్యాన్ ని స్వయంగా కలిసేందుకు అప్పటికి తొమ్మిదేళ్ళు ఉమ్మడి ఏపీని పాలించిన చంద్రబాబు రావడం అన్నది సెన్సేషన్. బాబుకు అప్పటికి రెండు మార్లు అధికారం చేజారింది. ఈసారి కూడా పోతే ఇక ఇబ్బందేనని గ్రహించి ముందు చూపుతో బాబు పవన్ని తనకు మద్దతు ఇమ్మని కోరారు. పవన్ సైతం నాడు బాబుకు మద్దతుగా నిలిచి ఏపీలో తిరిగారు. ఫలితంగా బాబు సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఇది గతం...


జగన్ వద్దకు కేటీయార్ :


ఇక అయిదేళ్ళ తరువాత సరిగ్గా అలాంటి పరిణామమే ఏపీలో మళ్ళీ చోటుచేసుకుంది. వైసీపీ అధినేత జగన్ వద్దకు టీయారెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ వచ్చారు. ఇది కూడా తెలుగు రాజకీయాల్లో సంచలనం రేకెత్తించిన పరిణామమే అయింది. ఎందుచేతంటే కేటీయార్ తెలంగాణాకు రేపో మాపో కాబోయే సీఎం అంటున్నారు. మంచి మెజారిటీతో అక్కడ టీయారెస్ అధికారం చేపట్టింది. మరో వైపు జగన్ ఏపీలో బలమైన ప్రతిపక్ష నాయకుడు. ఈ ఇద్దరి యువ నాయకుల కలయిక తెలుగు రాష్ట్రాలకే సరికొత్త చరిత్రగా మారుతుందా అనిపించేలా న్యూస్ వైరల్ అయింది.


అది ఎన్నికల రాజకీయం :


నాడు చంద్రబాబు పవన్ని కలసి మద్దతు కోరింది అచ్చంగా ఎన్నికల రాజకీయం కోసమే పవన్ కనుక మద్దతు ఇవ్వకపోతే అక్కడ టీడీపీకి ఓటమి తప్పదన్నది తరువాత వెలువడిన గణాంకాలు తెలియచేసాయి. ఆ రెండు పార్టీలు కలసి అభివృద్ది కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పొత్తు పెట్టుకున్నాయన్నది తెలిసిన విషయమే.


ఇది అభివుద్ధికి తొలి మెట్టు :


కానీ కేటీయార్, జగన్ కలయికను అలా చూడడానికి వీలులేదు. ఎందుకంటే కేటీయార్ కి  జగన్ని కలవకపోయినా అక్కడ అధికారం అయిదేళ్ళ పాటు చేతిలోనే ఉంటుంది. దేశ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ పేరిట చేస్తున్న ప్ర‌యత్నాలకు కూడా ఎటువంటి ఆటంకం ఉండదు. కానీ ఇక్కడ కలిసింది మాత్రం అక్షరాల రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనం కోసమనే చెప్పాలి. ఉప్పూ నిప్పులా బాబు జమానాలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడిచింది. సామరస్యపూర్వకంగా రెండు ప్రభుత్వాలు తమకు ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాల్సి ఉండగా ఆచరణలో మాత్రం అది జరగలేదు. పుణ్యకాలం అంతా పూర్తి అయింది. 


ప్రాంతాలుగా కలసి ఉండాలి :


ఇక తెలంగాణా, ఆంధ్రాగా విడిపోయినా ప్రాంతాలుగా కలసి ఉండాలన్న కేసీయార్ రాజనీతి మాత్రమే ఇలా జగన్, కేటీయార్ ని కలిపిందనుకోవాలి. ఉమ్మడి ఏపీలో చూసుకుంటే 42 ఎంపీ సీట్లతో డిల్లీలో తెలుగు వారి మాట బాగా చెల్లేది. గొంతు కూడా బలంగా వినిపించేది. కానీ ఇపుడు మారిన పరిస్థితుల్లో హస్తిన వేదిక మీద తెలుగు గొంతు బలహీనమైంది. జాతీయ స్థాయిలో మిగిలిన పార్టీలు ఇపుడు ముందు వరసలోకి వచ్చేశాయి. మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, ఎన్సీపీ, ఆఖరుకు పొరుగున ఉన్న తమిళనాడు, 28 ఎంపీ సీట్లు ఉన్న కర్నాటక తరువాత మాత్రమే తెలుగు రాష్ట్రాల గొంతు వినిపించే వీలుంది.
Image result for trs ysrcp
మరి ఈ విధంగా విడిగా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలకు నష్టమే. డిల్లీలో ఎవరికీ కూడా పరువూ పరపతి దక్కేదీ అనుమానమే. అదే కలిసి ఉంటే మాత్రం పెద్ద సంఖ్యలో ఎంపీలు ఉంటారు. విభజన తరువాత అక్కడా ఇక్కడా కూడా పేరుకుపోయిన అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వాటిని గట్టిగా గద్దించి సాధించుకోవచ్చు. అంతే కాదు మనకు అనుకూలమనిన ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు అయ్యేలా చూసుకోవచ్చు. 


యువతరం కదిలింది :


ఇక తెలంగాణాలో కేటీయార్. ఏపీలో జగన్ ఇద్దరూ ఇంచుమించుగా ఒకే వయసు వారు. ఇద్దరూ యువకులే, ఇద్దరూ ఒకేమారు రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరిదీ ఒకటే తపన. ఆలోచన. అందువల్ల ఫెడరల్ ఫ్రంట్ పేరిట ఈ రెండు పార్టీలు కలిసే అది తెలుగు రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అభివ్రుధ్ధిలో రెండు ప్రాంతాలు పోటీ పడే పరిస్థితి వస్తుంది. అన్నదమ్ముల్ల తెలంగాణా, ఆంధ్ర ప్రజలౌ కలసివచ్చే వీలు కూడా ఉంటుంది.  ఘర్షణలు తొలగి సామరస్యంగా అంతా ఒక్కటిగా ఉండేందుకు వీలు అవుతుంది.

మొత్తానికి ఇది మంచి పరిణామం. పొత్తులు ఎత్తులు అన్నవి రాజకీయాలకు మాత్రమే పరిమితం కారాదు, అభివ్రుధ్ధి కోసం కలవాలి అన్నది ఈ ఇద్దరు యువ నేతల భేటీ ద్వారా రుజువు చేయబోతున్నారు. అది మరింత ముందుకు సాగాలని ప్రతి తెలుగు వారూ కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: