జగన్ పై జరిగిన దాడి కేసు ను ఎప్పుడైతే ఎన్ ఐ ఏ కు బదిలీ అయిందో అప్పటి నుంచి టీడీపీ నేతలు మాట్లాడ్తున్న మాటలు విమర్శలుకు గురవుతున్నాయి. అయితే ఎన్ఐఏ విచారణ జరిగితే ఆ విషయాలే కదా బయటకు వచ్చేది. అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీకి అంత ఆందోళన ఎందుకు? అనేది సగటు పౌరుడిలో కలిగే అనుమానం. మరో విశేషం ఏమిటంటే.. ఎన్ఐఏ విచారణ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోర్టుకు వెళ్లబోతోంది అనేది. ఈ కేసులో ఎన్ఐఏ విచారణను ఆపించేయాలని కోర్టును కోరనున్నారట. ఈ మేరకు ఆలోచనలు సాగుతున్నాయని, ఏపీ ప్రభుత్వం వైపు నుంచి పిటిషన్ దాఖలు అయ్యే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.

Image result for jagan attack

అదే జరిగితే.. ఈ కేసులో మరిన్ని అనుమానాలు రేగే అవకాశాలున్నాయి. ఎన్ఐఏ విచారణకు ఇప్పటికే ఏపీ పోలీసులు సహకరించడం లేదని కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అటు సహకరించకపోవడం, ఇటు ఎన్ఐఏ విచారణను ఆపాలంటూ కోర్టుకు వెళ్లడం.. ఈ రెండూ జరిగితే, దేన్నో దాచడానికి గట్టి ప్రయత్నమే సాగుతోందని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది.

Image result for jagan attack

ఈ విషయంపై ఇప్పటికే చర్చ మొదలైంది. ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఢిల్లీలో ఉన్న ఒక వ్యక్తి ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించాడని, ఏపీలోని ఒక ముఖ్యనేత ఆశీస్సులతో.. ఈ వ్యవహారాన్ని అంతా ఢిల్లీలోని వ్యక్తి సమీక్షించాడని.. చాలామంది చెప్పుకుంటున్నారు. ఎన్ఐఏ విచారణ ధాటిగా కొనసాగితే... అటు ఢిల్లీలోని వ్యక్తి ముందుగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అందుకే ఎన్ఐఏ విచారణను ఆపించడానికి గట్టిగా ప్రయత్నాలు సాగుతున్నాయని సమాచారం!

మరింత సమాచారం తెలుసుకోండి: