ఎన్నికల ముందు చంద్ర బాబు ను లగటిపాటి కలవడం సంచలనం రేపుతోంది. అస్సలు ఎందుకు కలిసి ఉంటాడని రక రకాల విశ్లేషణలు మొదలైనాయి. ఎవరికీ తోచింది వారు ఉహించుకుంటున్నారు. అయితే ఎటువంటి రాజకీయ కోణం లేకుండా విరీద్దరి భేటీ ఉండదని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదో తన ఇంటిలో జరగనున్న ఓ కార్యానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు లగడపాటి వచ్చి ఉంటారన్న కొన్ని వర్గాలు చెబుతున్నా... ఎన్నికల వేళ అంత చిన్న విషయం కోసం లగడపాటి అంత దూరం వెళ్లి ఉంటారా? అని మరికొన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

Image result for chandrababu naidu and lagadapati

విదేశీ పర్యటనను కూడా రద్దు చేసుకున్న చంద్రబాబు... రాజకీయాలపై చర్చకు కాకుండా ఇతర విషయాలపై మాట్లాడేందుకు లగడపాటికి అపాయింట్ మెంట్ ఇచ్చేంత ఛాన్స్ కూడా లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.అయితే... వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు లగడపాటి పావులు కదుపుతున్నారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల నుంచి సన్యాసం తీసుకున్నారు కదా? ఎలా పోటీ చేస్తారంటారా? ఎందుకు పోటీ చేయకూడదు?  రాజకీయ నేతలు ఏనాడైనా మాట మీద నిలబడ్డారా? ఇది కూడా అంతే.

Image result for chandrababu naidu and lagadapati

నాడు చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నాననో - లేదంటే అసలు ఆ విషయాన్ని ఏమాత్రం ప్రస్తావించకుండానే లగడపాటి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అయితే లగడపాటి తాను పోటీ చేసే విషయానికి సంబంధించి కాకుండా... తనకు అనుకూలమైన వారికి టికెట్లు ఇప్పించుకునేందుకు బాబును కలిసి ఉంటారని మరో వాదన వినిపిస్తోంది. ఈ వాదనతో పాటుగా రాష్ట్రంలో టీడీపీకి విజయావకాశాలు ఏ మేర ఉన్నాయన్న విషయంపై చర్చించేందుకే లగడపాటిని చంద్రబాబు పిలిచి ఉంటారని మరో వాదన వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: