జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నం దర్యాప్తుకు సంబంధించిన కేసులో చంద్రబాబునాయుడుకు హైకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. ఎన్ఐఏ విచారణను వ్యతిరేకిస్తూ రాష్ట్రప్రభుత్వం హై కోర్టులో వేసిన హౌజ్ మోషన్ పిటీషన్ ను కోర్టు కొట్టేసింది. అంటే చంద్రబాబు చేసిన ఎన్ఐఏ విచారణను కోర్టు తోసిపుచ్చింది. ఎన్ఐఏ చట్టం ప్రకారం జగన్ కేసును ఎన్ఐఏనే  విచారిస్తుందని కోర్టు స్పష్టంగా చెప్పేసింది. పైగా హౌజ్ మోషన్ లో విచారించాల్సినంత అత్యవసరమైన కేసేమీ కాదని కూడా రాష్ట్రప్రభుత్వానికి బాగా తలంటి పోసింది. దాంతో అడ్వకేట్ జనరల్ గా ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు.

 

మొదటి నుండి జగన్ పై జరిగిన దాడి ఘటనను చంద్రబాబు అండ్ కో చాలా ఎగతాళి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మొదట్లో ఎగతాళిగా మాట్లాడిన నేతలే ఎన్ఐఏ విచారణ మొదలయ్యే సమయానికి అదే నేతల్లో టెన్షన్ మొదలైన విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్ఐఏ విచారణ మరింత ముందుకు జరిగితే టిడిపి నేతలకు  ఇబ్బందులు తప్పవని అందరికీ అర్ధమైపోయింది. విమానాశ్రయంలో ఘటన జరగ్గానే జరిగిన హత్యాయత్నంతో రాష్ట్రప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదనేశారు చంద్రబాబు. ఘటనకు బాధ్యత వహించాల్సింది కూడా కేంద్రప్రభుత్వమే అని కూడా స్పష్టంగా తేల్చేశారు.

 

బాధత కేంద్రంపై మోపిన చంద్రబాబు ఏమాత్రం సంబంధం లేకపోయినా సిట్ తో ఎందుకు విచారణ  చేయించారో అర్ధం కాలేదు. పైగా సిట్ విచారణ కూడా ఏదో తూతూ మంత్రంగా జరిపించేసి కేసు క్లోజ్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నారు.  ఈ విషయాలను ముందుగానే గ్రహించిన జగన్ తనకు రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలోని పోలీసు విచారణపై నమ్మకం లేదంటూ కోర్టుకెక్కారు. థర్డ్ పార్టీ విచారణ కోరారు. అందుకు తగ్గట్లే కోర్టు స్సందించి  ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది. అక్కడి నుండే చంద్రబాబు అండ్ కో గగ్గోలు మొదలైంది. చివరకు కోర్టుకెక్కి పరువు పోగొట్టుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: