భారత ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేఖంగా ఉన్న పార్టీలు అన్నీ యునైటెడ్ ఇండియా బ్రిగేడ్ లో పాల్గొన్నాయి కొత్తగా వచ్చి చేరిన తెలుగు దేశం పార్టీతో సహా!  అయితే అందరూ మాట్లాడిన ప్రధాన అంశం మోడీని గద్దె దించాలి అన్నది ప్రదాన అంశం. ఇందులో ప్రజలు లేరు - ప్రజా సమస్యల ప్రస్థావన కనిపించలేదు. ఈ పరిస్థితి చూస్తుంటే ఒకనాడు దేశంలోని రాజకీయ పక్షాలన్నీ ఏకమై నాటి ప్రధాని ఇందిరా గాంధిని "ఢీ" కొని పూర్ణ పరాభవం పొందిన చందంగా ఉంది అంటున్నారు విశ్లేషకులు.

Image result for united india brigade

మోదీ పతనానికి కోల్‌కతా యునైటెడ్ ఇండియా బ్రిగేడ్ సభ నాంది అన్నారు టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 2019లో దేశ ప్రజలు కొత్త ప్రధానిని చూడబోతున్నారని జోస్యం చెప్పారు. శనివారం కోల్‌కతాలో ఏర్పాటు చేసిన యునైటెడ్ ఇండియా బ్రిగేడ్ లో చంద్రబాబు ప్రసంగించారు. బెంగాల్‌ లో తన ప్రసంగాన్ని ప్రారంభించి ఆకట్టుకున్నారు.

Image result for united india brigade విపక్షాల ఐక్యత కోసం ఇలాంటి గొప్ప సమావేశం ఏర్పాటు చేసిన మమతా బెనర్జీని చంద్రబాబు అభినందించారు. దేశ ప్రజల్ని బీజేపీ మోసం చేసింది.. అబద్ధపు వాగ్థానాలతో అధికారంలోకి వచ్చింది. బీజేపీ విభజించి పాలించు విధానాన్ని అవలంభిస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఆర్బీఐ, సీబీఐ, ఈడీ వంటి సంస్థల్ని కేంద్రం భ్రష్టు పట్టించింది. అలాగే రాఫెల్ డీల్ పెద్ద అవినీతి స్కాం.. రాఫెల్‌పై సుప్రీం కోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు అని విమర్శించారు.

 Image result for united india brigade

నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.. గత నాలుగేళ్లలో ఆర్థిక అభివృద్ది మందగించింది. దేశం లో పెట్రోల్ రేట్లు భగ్గుమంటున్నాయి. ధరల పెరుగుదలను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. నాలుగేళ్ల పాలనలో రైతులు మోసపోయారు.. రైతుల కష్టాలు బీజేపీకి పట్టవు. ఇక రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది. కర్ణాటకలోనూ ఎన్నికైన ప్రభుత్వాన్ని కుప్పగూల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు.

 

దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది అది మన బాధ్యత. స్వాత్రంత్ర్య సంగ్రామానికి పశ్చిమబెంగాల్ దశా-దిశ చూపించింది అదే స్ఫూర్తితో ప్రతిపక్షాల ను ఏకం చేయాలనుకుంటున్నాం. మా అందరి నినాదం ఒక్కటే సేవ్ ఇండియా సేవ్ డెమోక్రసీ 2019లో దేశ ప్రజలు కొత్త ప్రధానిని చూడబోతున్నారు

 

రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు మండిపడ్డారు. కర్ణాటకలోనూ ఎన్నికైన ప్రభుత్వాన్ని కుప్పగూల్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

 

టీఎంసీ మెగా ర్యాలీ లో చంద్రబాబు శనివారంనాడు మాట్లాడుతూ, కర్ణాటకలో ఎమ్మెల్యే లను జంతువుల్లా కొనుగోలు చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని, విభజన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. సీబీఐ, ఆర్బీఐ, న్యాయ వ్యవస్థ నుంచి ప్రతి వ్యవస్థను కేంద్రం నీరుగారుస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అదుపుతప్పుతున్నాయని అన్నారు. ఏమాత్రం అనుభవం లేని రిలయెన్స్‌కు రాఫెల్ డీల్ కట్టబెట్టడం ఏమిటని మోదీ సర్కార్‌ను నిలదీశారు.

 Image result for united india brigade

2019లో కొత్త ప్రభుత్వాన్ని చూడబోతున్నామని జోస్యంచెప్పారు. మోదీ, అమిత్‌షాలను కోరుకుంటున్నారా? మార్పు కోరు కుంటున్నారా? అని ప్రజలను బాబు ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ విక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం ప్రశంసనీయమని అన్నారు. దేశమే అందరికీ ముఖ్యమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కలసికట్టుగా పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: