ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కోసం చాలా ఏర్పాట్లు చేసుకున్నారు. కేంద్రం ఆయన పర్యటనను కుదిస్తే దాన్ని అప్పట్లో రాద్దాంతం కూడా చేశారు. గుజరాత్ కంటే ఏపీకి పెట్టుబడులు ఎక్కువ వస్తాయనే బాబు టూర్‌ను పర్మిషన్ ఇవ్వడం లేదని టీడీపీ నేతలు ప్రచారం చేశారు.



కానీ ఇప్పుడు ఎలాంటి హడావిడి లేకపోయినా తానే స్వయంగా దావోస్‌ టూర్‌ రద్దు చేసుకున్నారు. నారా లోకేశ్‌ ను పంపేసి తాను మాత్రం ఏపీలోనే ఉంటున్నారు. మరి విదేశీ పర్యటన రద్దు చేసుకునేంత అర్జంట్ పనులు ఏపీలో ఏమున్నాయి.. బాబు టూర్ ఎందుకు రద్దయింది.. ?


ఈ ప్రశ్నలకు ఆసక్తికరమైన వాదనలు సమాధానంగా వినవస్తున్నాయి. జగన్‌పై కోడికత్తి దాడి కేసులో ఎన్‌ఐఏ విచారణ పట్ల చంద్రబాబు టెన్షన్‌గా వున్నారని తెలుస్తోంది. ఈ కోడికత్తి కేసు టీడీపీ కీలక నేత మెడకు చుట్టుకుందని.. ఆ కేసులో అరెస్టు కూడా తప్పదని అంటున్నారు. ఈ సిట్యుయేషన్ హ్యాండిల్‌ చేసేందుకే చంద్రబాబు ఏపీలోనే ఉన్నారని.. విదేశీ పర్యటన రద్దు చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది.



వాస్తవానికి కోడికత్తి ఘటన జరిగిన మొదట్లో చంద్రబాబు.. ఈ దాడితో తనకేం సంబంధం అంటూ వాదించారు. ఘటన జరిగింది ఎయిర్‌పోర్టులో అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఏం బాధ్యత అని ప్రశ్నించారు. ఇప్పుడేమో ఈ కేసులో కేంద్రానికి ఏం సంబధం అంటూ ఉల్టా మాట్లాడుతున్నారు. ఈ కేసు ఎన్ఐఏకు ఇచ్చినందుకు రోజూ దుమ్మెత్తిపోస్తున్నారు. మరి ఈ కోడికత్తి కేసు చివరకు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: