సమస్యలెన్ని ఉన్నా 125 కోట్ల ప్రజల విశాల భారతానికి ధీటుగా నేతృత్వం వహిస్తూ ముందుకు నడిపిస్తున్న నరేంద్ర మోడి నాయకత్వానికి ఈ మహా కూటమి ప్రత్యామ్నాయ ప్రధాన మంత్రిని అందించే విషయంలో తప్పటడుగులు వేస్తున్నాయి. కాంగ్రెస్ తమ రాష్ట్రాల్లో కూటమి కట్తటానికి ఏ మాత్రం ఇష్టపడని ఉత్తర ప్రదెశ్ నాయకులు అఖిలేష్ యాదవ్ మాయావతి ఇరువురితో పాటు అదే భావన కల మమతా బెనర్జీ లు మహాఘట్భంధన్లో ఉన్నారు. ఎప్పటికైనా వీరు ఐఖ్యత సాధిస్తారా! అనేది పెద్ద ప్రశ్న.   
Image result for stalin's pm candidate
దేశ రాజకీయాల్లో ప్రధాన మంత్రి పదవి ఇప్పుడు ప్రధాన విషయంగా (హాట్-టాపిక్) మారింది. ఇంకా సార్వత్రిక ఎన్నికలు రాక ముందే రాజీవ్ గాంధియే భావి భారత ప్రధాని అని డి ఎం కె స్టాలిన్ అంటే ముఖం మాడ్చుకున్న మమత బెనర్జీ గుర్తుకు రాక మానదు. ఏ పార్టీకి ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసి సాధారణ ఎన్నికల రూపంలో వేడి రాజేస్తోంది. దీంతో దేశ రాజకీయాల్లో ప్రధాని పదవిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 
Image result for Mahaghatbhandhan prime minister candidate
ఇప్పటికే డీఎంకే  అధినేత స్టాలిన్ ఇటీవలే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి అంటూ ప్రకటించగా ఈ ప్రకటన కాస్త దేశ రాజకీయాల్లో అలజడి సృష్టించింది. ఆ తర్వాత ఎస్పీ నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సైతం తమ ప్రధాని అభ్యర్థి బిఎస్పి నేత మాయావతి అంటూ ప్రకటించేశారు. 
Image result for Mahaghatbhandhan prime minister candidate
ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ, ఎస్పీల మధ్య పొత్తు కుదరిన సందర్భంలో అఖిలేష్ యాదవ్ మాయావతిని ప్రధాని అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. తాజాగా మరోసారి ప్రధాని ఎవరు అనే అంశం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అఖిలేష్ యాదవ్. పశ్చిమ బంగాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మాయావతి నిర్వహించిన ర్యాలీలో పాల్గొనేందుకు హాజరైన అఖిలేష్ యాదవ్ దేశ ప్రధానిగా బీఎస్పీ అధినేత్రి మాయావతి లేదా, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ గాని ప్రధాని అయితే బాగుంటుంది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
Image result for Mahaghatbhandhan prime minister candidate
దేశంలో మాయావతి, మమత బెనర్జీ ఇద్దరూ బలమైన నేతలే ననీ, మహాకూటమిని నడిపించగల శక్తి వారిలో ఉందని స్పష్టం చేశారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది సమస్య కాదని,  ప్రస్తుతం తమ ముందన్న లక్ష్యం బీజేపీని ఓడించడమేనని ఆ తర్వాత కవర్ చేసుకున్నారు.  అంతే కాదు దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో దేశానికి కొత్త ప్రధాని కావాలని, సరికొత్త నాయకత్వానికి తమ కూటమి నాంది పలుకుతుందని అఖిలేష్‌ యాదవ్ స్పష్టం చేశారు. 

Image result for Mahaghatbhandhan prime minister candidate

మరింత సమాచారం తెలుసుకోండి: