చంద్రబాబు నాయుడు మమత బెనర్జీ ఇచ్చిన  తేనీటి విందులో అంతా తానే అయి పర్యవేక్షణ బాధ్యత నిర్వహించారట – ఒక పచ్చ పత్రిక పనిగట్టుకొని కథనం. ఆయన అక్కడ హాజరైన 26 పార్టీల నాయకులలో ఒక్కడు. బహుశ అందరికి తేనీరు సేవలు అందించారేమో?  ఒక రాలీ విజయవంతం అయితే మాత్రం  ఇల్లలక గానే పండగ కాదని గమనించాలి. ఒకవేళ బిజెపి వ్యతి రేఖపక్షం మహాఘట్భంధన్ లేదా మహాకూటమి గెలిచినా రాష్ట్రంలో చంద్రబాబు కు, జనం ఓట్లెసే పరిస్థితి లేదు కాబట్టి  జనం ఝలక్ ఇస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి? 
Image result for united india brigade
ఎవడి గొల వాడిది అక్కడ - ఆహా! ఓహో! అంటూ చక్క భజన ఇక్కడ 

ఒక పత్రిక భజన: భారీ ర్యాలీలో, బహిరంగ సభలో చంద్రబాబు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇదిలా ఉంటే వక్తలు తమ ప్రసంగాల్లో చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించడం ఆయన దక్కిన గౌరవమనే చెప్పుకోవచ్చు. భిన్న పార్టీలను ఏకం కావడంతో చంద్రబాబు భూమికను నేతలు అభినందించారు.


అసలు నిజం: అక్కడ పరిస్థితి చూస్తే అందరూ సమానులే ఒక్క మమత తప్ప మన కేసీఆర్ ఎన్నికల ముందు నిర్వహించిన ప్రగతి నివేదన సభ కంటే ఎక్కువ జనం రాలేదు. సభ ద్వారా తాను ప్రధాని పదవికి పోటీ పడబోతున్న అభిప్రాయాన్ని మమత చెప్పకనే చెప్పారు. అందుకే అది గమనించే మాయావతి ఈ సభకు హాజరు కాలేదు – ఇందులో చంద్రబాబు అందరి లాగానే హాజరయ్యారు ప్రశంసల వర్షం అనేదే అక్కడ లేదని, ఈ యన పోషించిన భూమిక అంటూ ఇక్కడ పత్రికల కథనం మాత్రమేనని అక్కడ అభిఙ్జవర్గాల కథనం. మామూలుగా   సభను అందరిలాగానే నుద్ధేసించి ప్రసంగించారు. ఇంకా ప్రాక్టీస్ చేసి మాట్లాడిటే బాగుండేది. మరీ కూడబలుక్కొని బెంగాలీ మాట్లాడారు. చివరకు ఇంగ్లీష్ కూడా అలాగే.

Image result for chandrababu addressed united india brigade

నలుగురితో నారాయణే! - ఇంకా ఈయనే పూసుకున్నట్లుంది పరిస్థితి 

చంద్రబాబు ఉపన్యాసంలో శ్రీ రంగ నీతులు తప్ప – ఆయన పాటించి ఇతరులకు చెప్పే నీతి శూన్యం. 

ఒక పత్రిక భజన: ఈ సందర్భంగా చంద్రబాబు ప్రధాని మోదీపై మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాల రాస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.



అసలు నిజంఆంధ్ర ప్రదెశ్ లో ప్రతిపక్షం హక్కులను పూర్తిగా కాలరాసిన చంద్రబాబుకు అలా మాట్లాడే హక్కుందా! ఇక్కడ చింతమనేని లాంటివాళ్ళకున్న స్వాతంత్రం, సామాన్య ప్రజలకు ఉందా! ప్రత్యేక హోదా కోసం ఏపి ప్రజలు ఉద్యమించిన సమయంలో నాడు బిజేపితో మైత్రి మైకంలో ప్రజలను చితక బాది జైళ్లలో కుక్కిన వైనంచూస్తే  మీరెంతగా ప్రజల హక్కులను కాపాడారో తెలుస్తుంది.
Image result for chandrababu addressed united india brigade
కర్ణాటకకు ఈయనే వెళ్ళారు - వాళ్ళెవరూ పెద్దగా పట్తించుకున్న దాఖలాలు లేవు


ఒక పత్రిక భజన: కర్ణాటకలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కుప్ప గూల్చే ప్రయత్నాలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.



అసలు నిజంతెలంగాణాలో ప్రజాస్వామ్య పద్దతిలో ఎంపికైన ప్రజాప్రతినిధులను కొనేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు కూల్చ ప్రయత్నిచి ఓటుకు నోటు – బ్రీఫ్డ్ మి – వీడియో లో బుక్కై ఏకంగా దశాబ్ధం పాటు అనుభవించాల్సిన రాజధానిని మూటా ముల్లే సర్ధుకొని రాత్రికి రాత్రి అమాంతంగా సపరివార సమేతంగా గజనీ మహమ్మద్ లాగా అమరావతి పారిపోయిన ఉదంతం అందరికీ తెలిసిందేగా సారూ! మరి మీ బాషలో దీన్ని ప్రజాస్వామ్యమంటరా దొరా! 
Image result for chandrababu neetulu

ఒక పత్రిక భజనకర్ణాటకలో ఎమ్మెల్యేలను జంతువుల్లా కొనుగోలు చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు.



అసలు నిజంఅమ్మో! అమ్మో! ఇది నిజంగా గుండెలు బాదుకోవలసిన అంశం. ఏపిలో నడిరోడ్దులో నిలబెట్టి మరీ 23 మంది వైసిపి ఎమెల్యేలను కొన్నవారు జంతువులా?అమ్ముడు పోయిన వారు జంతువులా?  చెప్పేటందుకె నీతులు ఉన్నాయి,  అన్నట్లు చంద్రబాబుగారి నీతులివి. ఇక నీతు లందు చంద్రనీతులు వేరయా! అని చెప్పుకోవాలేమో? 
Image result for chandrababu neetulu

ఒక పత్రిక భజనమతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని, విభజన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. 



అసలు నిజం: ఏపిలో ఒక్క బాబు కులం కోసమే ఏకంగా రాజధాని ప్రాంతాన్ని కేటాయించారు కదా బాబు గారు! కులం బందు స్వజనం లింగం మతం జాతుల విభజన గురించి మీకున్న పరిఙ్జానం అనుభవం అదీ నాలుగుదశాబ్ధాల సుధీర్ఘ అనుభవం ఉన్న మిమ్మల్ని  మించిన నేతలెవరైనా దేశంలో ఉన్నారా? 
Image result for chandrababu neetulu

ఒక పత్రిక భజన: సీబీఐ, ఆర్బీఐ, న్యాయవ్యవస్థ నుంచి ప్రతి వ్యవస్థను కేంద్రం నీరు గారుస్తోందన్నారు.


అసలు నిజం: మహిళా సాధికార సభకు వచ్చేసిన వైసిపి ఎమెల్యే రోజాని మీ పోలీసులు వ్యవస్థ, వనజాక్షి రెవెన్యూ అధికారిణి ని మీ ఎమెల్యే, భూకబ్జాల్లో మీ విజయవాడ ఎమెల్యే (ఇలాంటి టిడిపి నాయకుల చిట్టా రాస్తే గ్రంధాలు చాలవు) హింసించగా మీ పోలీసులు వ్యవస్థ ఎంత బాగా పనిచేసిందో? జనాలకు తెలుసు.


అంతెందుకు మీది కాని చోట మీరు ప్రవేసించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మొహనరెడ్డిపై హత్యాప్రయత్నంలో మీరు,  మీ పోలీసు అత్యున్నతాధికారి మీ ప్రజాప్రతినిధులు  మీ సిట్ వ్యవహరించిన తీరు – చూస్తుంటే  ఆ హత్య ప్రయత్నం లో ఎవరి ప్రమేయముందో జనం గుర్తించారు సుమా!  జనం వేళ్లు మీ వైపే చూపిస్తున్నయి.  అంతే కాదు కేంద్ర సంస్థ ఎన్ ఐ ఏ పరిశోధన విచారణ మొదలైతే  మీరెందుకు వణుకుతున్నారు? న్యాయవ్యవస్థని మానేజ్ చేసి ఎన్ ఐ ఏ విచారణ ఆపించుకోవాలని మీరుచేసే ప్రయత్నం చూస్తుంటే  దోషి ఎవరో జనం గుర్తుపట్టేస్తున్నారు. వ్యవస్థలని నియంత్రించటం లో మీరే కదా! ఆది గురువు


బిగ్ బజార్ - హేరిటేజ్ దీల్ పై జనం ప్రశ్నిస్తున్నారు  మీరు మీవాళ్ళు నీతిమంతులు కాకపోవటం వలననే మీరు రాష్ట్రంలో సిబీఐ  ప్రవేశాన్ని నిషేధించారన్నది జగమెరిగిన సత్యం కాదా!  మీ టిడిపి నాయకులు సుజానా చౌదరి, సిఎం రమెష్, బీద మస్తాన్ రావులవద్ద దొరికిన పన్ను ఎగవేత సొమ్ము దీనికి సాక్ష్యం కాదా! ఎందుకు బాబు ! మీ నీతులు.
Image result for chandrababu neetulu

ఒక పత్రిక భజన: ఏమాత్రం అనుభవంలేని రిలయెన్స్‌కు రాఫెల్ డీల్ కట్టబెట్టడం ఏమిటని మోదీ సర్కార్‌ను నిలదీశారు.


అసలు నిజం: ఏ మాత్రం నిర్మాణ పరిఙ్జానం లేని ట్రాన్స్-ట్రోయ్ కి మీరు పోలవరం తదితర కాంట్రాక్టులు ఇచ్చిన వైనం  మరచారా! ఒక్క సారి ఆత్మ పరిశీలన చేసుకోండి రిలయన్స్ లు అంబానీలు ఎవరు బాబు! మీ మిత్రులు కాదా! ఆత్మ వంచన దగా కాదా! ఇదంతా? ఈ దేశంలో ఇప్పటివరకు పరిపాలించిన ప్రభుత్వాల్లో ఎంతో కొంత వాజపేయీ మోడీ నాయకత్వంలోని ప్రభుత్వాలే బెటర్. మీరు నిలబెట్టారని చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వాల ప్రధానుల చరిత్ర చూస్తే ఒక్కొక్కడు ఎంత దోచు కున్నారో భారత జాతికి తెలుసు. ఇప్పుడు మీరు పాదసేవ చేసే కాంగ్రెస్ స్కాముల రాజధాని అని ఒకప్పుడు మీరే చెప్పారు   

Image result for chandrababu neetulu

ఇదంతా చూసి మేమేదో బిజెపి, వైసిపి, జనసేనకి చెందిన వారమన్నా, వారి మద్దతుదార్లమన్నా, అంతకంటే ఆత్మవంచన, ఆత్మ ద్రోహం వెరే ఉండదు.  జస్ట్ ఒక పత్రిక పనిగట్టుకొని మీకు చెసే భజన చూసి ఊరకుండలేం కదా! 

మరింత సమాచారం తెలుసుకోండి: