రాజకీయ అనుభవం లేకపోవడం జగన్ కు మైనస్‌ పాయింట్‌ గా మారుతుందా.. ఎన్నికల వ్యూహాల్లో పండిపోయిన చంద్రబాబు క్రమంగా జగన్ పై పైచేయి సాధిస్తున్నారా.. వచ్చే ఎన్నికల్లోనూ జగన్‌కు నిరాశ తప్పదా.. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు చూస్తే ఇలాంటి అనుమానాలు కలుగుతున్నాయి.

Image result for chandrababu vs jagan


రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలి.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి..ఇదీ జగన్ ఆలోచన. అందుకే.. ఎన్నికల కంటే చాలా ముందుగానే ఆయన నవరత్నాలు పేరుతో తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తాడో చాలా డిటైయిల్డ్ గా వివరించారు. వాటికి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.

Related image


కానీ ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు ఒక్కొక్కటిగా వాటిని అమలు చేయడం ప్రారంభిస్తున్నారు. దీనివల్ల వచ్చే ఎన్నికల్లో జగన్ నవరత్నాలకు ప్రాధాన్యం లేకుండా పోతుంది. వాటిని ఇప్పటికే చంద్రబాబు అమలు చేస్తుండటం వల్ల ఆయనకు ఓట్లు కురిపించే ఛాన్స్‌ ఉంది.

Image may contain: 6 people, people smiling


వచ్చే ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావిస్తున్న చంద్రబాబు.. ఎన్నికల కంటే ముందుగానే జగన్‌ స్కీములను అమలు చేస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే వాటిని ఎలా కొనసాగించాలో అప్పుడు చూసుకోవచ్చు. అధికారంలోకి రాకపోతే.. ఆ ఇబ్బందులేవో జగన్‌ పడతారు అన్న కోణంలో ఆలోచిస్తున్నారు. సో.. పరీక్షలకు చాలా ముందుగానే ప్రశ్నాపత్రం లీక్‌ చేయడం ద్వారా జగన్ వ్యూహాత్మకంగా తప్పు చేశారేమో అని సొంత పార్టీనేతలే అంతర్మథనంలో పడిపోయారు. మరి చంద్రబాబు వ్యూహం ఎంతవరకూ ఎన్నికల్లో ఫలిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: