కూటమి నాయకుడని చెప్పుకునునే చంద్రబాబును అఖిలేష్, మాయలు ముందు మీ పీఠం చూసుకొని రమ్మన్నారట.  విపరీత ప్రచారం పెనుభూతమై పట్టు కుంటే ఏర్పడే దిక్కుమాలిన పరిస్థితి ఇదే. అంటున్నారు బిజేపి బృందం 

Image result for mayavati chandrababu akhilesh

బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడే పరిస్థితి లేదని బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాదవ్ అన్నారు.  కడపలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎందు కంటే ఉత్తరప్రదేశ్ లోని అఖిలేష్, మాయావతి ఇప్పటికే మహాకూటమి నాయకుడిగా చెప్పుకుంటున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబును ముందు మీ పీఠం గురించి ఆలోచించి రమ్మనట్లు ఢిల్లీలో చెప్పుకుంటున్నారు అన్నట్లు చెప్పుకుంటున్నారు.

Image result for mayavati chandrababu akhilesh

*తొమ్మిది సంవత్సరాల్లో హైదరాబాద్‌ను నేనే కట్టానని, చెబుతున్న సీఎం చంద్రబాబు మరి ఐదేళ్లలో అమరావతి రాజధానిని ఎందుకు కట్టలేకపోయారో? ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

*దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వాల్లో ఏపీలోని టీడీపీ సర్కార్‌ నాలుగో స్థానంలో ఉందని సాక్షాత్తు ఢిల్లీలోని సీడీఎఫ్‌ నివేదిక ఇచ్చిందన్నారు.

Image result for BJP Kapileswaraiah

కర్నూలు ఇన్‌చార్జి కపిలేశ్వరయ్య మాట్లాడుతూ, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం, అభివృద్ధికి నిధులు ఇస్తే, వాటిని టీడీపీ నాయకులు అప్పనంగా భోంచేశారని దుమ్మెత్తి పోశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుల రాజమోహనరెడ్డి మాట్లాడుతూ శక్తి కేంద్రాల ప్రముఖ్‌ లు ఎన్నికల వరకు పెద్ద యజ్ఞం చేయాలన్నారు.


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. ఏపీ అభివృద్ధి చెందక పోవడానికి ప్రధాన అడ్డంకి చంద్రబాబు నాయుడే నని ఆరోపించారు. కడప జిల్లా లో కందుల ఎస్టేట్‌లో రాయల సీమ స్థాయి శక్తికేంద్రాల ప్రముఖ్‌ లతో నిర్వహించిన సమావేశంలో బీజేపీ నేతలు విరుచుకు పడ్డారు.


ఏపీ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రం విభజన అనంతరం ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఆంధ్రప్రదేశ్‌ కు కేంద్రం ఇచ్చిందన్నారు. కేంద్రం చేసిన సహాయాన్ని నిర్భయంగా చెప్పే దమ్ము,  ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు.

Image result for mayavati chandrababu akhilesh

*అనంతపురం జిల్లాలో కియా మోటార్స్‌ పరిశ్రమ వచ్చిందంటే అది ప్రధాని మోదీ చలవేనని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు.

*రాయలసీమ జిల్లాల్లో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి కూడా చొరవ తీసుకుంది కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వమే నన్నారు.

*ప్రాజెక్టులకు కోట్లరూపాయలు ఇచ్చి పూర్తిచేయమని కేంద్రం చెబితే ఆ నిధులను తన అనుయాయులైన కాంట్రాక్టర్‌లకు ఇచ్చుకుని కమీషన్‌ నొక్కేశారని ఆరోపించారు.


*నీరు – చెట్టు పథకం పేరుతో చెరువులను చెరపట్టి దోపిడీకి తెరతీశారని మండిపడ్డారు. వైఎసార్ జిల్లా కేంద్రమైన కడప నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రం లోని ప్రజలు నిజాయితీ పరిపాలన అందించాలని అధికారమిస్తే చంద్రబాబు ఆ అధికారాన్ని స్వప్రయోజనాలకు వాడుకున్నారంటూ విరుచుకుపడ్డారు.

*2014న సీఎంగా ప్రమాణ స్వీకారం రోజున కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి పీయూస్‌ గోయల్‌ ఈ రాష్ట్రానికి 24 గంటలు కరెంటు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రం 24 గంటలు విద్యుత్ ఇస్తుంటే దాన్ని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవడం దారుణమన్నారు.

*రాయలసీమ వెనుకబాటు తనానికి చంద్రబాబు వైఖరే కారణమని ఆరోపించారు. రూ.75 వేల కోట్ల విలువ చేసే మట్టిని అమ్ముకుని టీడీపీ నాయకులు సొమ్ము చేసుకున్నారంటూ ధ్వజమెత్తారు. 

*కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకోసం వనరులకు సంబంధించి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరితే అందుకు ఎలాంటి సహకారం, సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు.

Image result for kandula rajamohan reddy BJP

మరో వైపు రాష్ట్రంలో తెలుగు దేశం ప్రభుత్వం రైతులను, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగ యువతను మోసం చేసిందని అఖిల భారత మహిళా మోర్చా ఇన్‌చార్జి దగ్గుబాటి పురంధేశ్వరి  ఆరోపించారు. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: