తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా  తీసుకుంది. మరో మారు అధికారంలోకి రావాలని ఆ పార్టీ అనుకుంటోంది. ఈ నేపధ్యంలో అన్ని వర్గాలను మంచి చేసుకోవడంతో పాటు, పార్టీలోని అసంత్రుప్తులను కూడా దగ్గర చేసుకోవడం ద్వారా టీడీపీ పై చేయి సాధించాలనుకుంటోంది. ఈ నేపధ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్యే ఒకరు టీడీపీకి  గట్టి షాక్ ఇవ్వబోతున్నారని టాక్.


ఏకైక  ఎమ్మెల్యే :


కడప జిల్లాలో టీడీపీ తరఫున గెలిచిన ఏకైక‌ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సైకిల్ దిగిపోతారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. దానికి బలం చేకూర్చేలా ఈ రోజు ఆ పార్టీ మీటింగ్ ఆయన సొంత నియోజకవర్గం రాజంపేటలో పెడితే మేడ గైర్ హాజరు అయ్యారు. కడప మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి కలసి నిర్వహించిన  ఈ కీలకమైన పార్టీ మీటింగుకు మేడా డుమ్మా కొట్టడంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమన్న మాట గట్టిగా వినిపిస్తోంది. 
దీనికి తోడు రాజంపేటలో టీడీపీ రెండుగా చీఇలిపోయైంది. ఓ బలమైన వర్గంతో కలసి మేడ వేరే చోట ఇదే రోజు కీలకభేటీ అవుతున్నారన్న వార్తలు కడప టీడీపీ నేతలకు నిద్ర పట్టనీయడంలేదు. ఇక రాజంపేటలో టీడీపీ పరిస్థితిపై ఈ నెల 22న చంద్రబాబు కూడా మీటింగ్ పెట్టి మరీ మేడ విషయంలో నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఇన్నాళ్ళూ ఆయన పార్టీ పరంగా దూరం పటిస్తున్నా కలుపుకునిపోదామనుకున్న టీడీపీ అధినాయకత్వం మేడ ఇక టీడీపీకి కావాలనే  వదిలేస్తున్నరన్న ఆలోచనకు వచ్చింది. దాంతో ఆయన పార్టీ మారకముందే సస్పెండ్ వేటు వేయాలని చూస్తోందట.


వైసీపీలోకేనా :


ఇక మేడా మల్లికార్జునరెడ్డి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఇదే సీటుకు పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ మేరకు ఆయన వైసీపీ నేతలతో రాయబేరాలు నడుపుతున్నారని టాక్. అన్నీ కుదిరితే జగన్ సమక్షంలో తొందరలోనే టీడీపీ తీర్ధం పుచ్చుకుంటారని అంటున్నారు. కడపలో వైసీపీకి దెబ్బ కొడదామనుకున్న టీడీపీకి ఆదిలోనే ఇలా షాక్ తగలడం ఇబ్బందికరమేనని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: