ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రంలోని మోడీకి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మోదీని దించేస్తానంటూ దేశవ్యాప్తంగా తిరుగుతూ చంద్రబాబు మీటింగులు పెడుతూంటే బాబు విషయంలో ఏంచేయాలా అని మరోవైపు  మోడీ సీరియస్ గానే ఆలోచన చేస్తున్నారుట.


కొత్త గవర్నర్ కిరణ్ బేడీ :


ఈ నేపధ్యంలో ఏపీకి కొత్త గవర్నర్ గా కిరణ్ బేడీని పంపించాలని మోడీ కీలకమైన నిర్ణయమ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నిబద్ధత కలిగిన పోలీస్ అధికారిణిగా పేరుతెచ్చుకున్న కిరణ్ బేడీ డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధిణిగా ఉన్నారు. ఆ తరువాత ఆమె పాండిచ్చేరీ లెఫ్టినెంట్ గవర్నర్ గా  నియమితులయ్యారు. ఇపుడు ఆమెను ఏపీకి కొత్త గవర్నర్ గా తీసుకురావాలని మోడీ భావిస్తున్నారుట. ఏపీకి కూడా గవర్నర్ గా నరసిమ్హం కొనసాగుతున్న సంగతి విధితమే. ఆయన పదవీ కాలం ఎపుడో పూర్తి అయినా కూడేఅ కేంద్రం కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలో గట్టి మనిషిగా పేరు తెచ్చుకున్న కిరణ్ బేడీని ఏపీకి గవర్నర్ గా పంపడం ద్వారా బాబుకు ముకుతాడు వేయాలనుకుంటోందని భోగట్టా. 


 ఓ వైపు ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిధ్ధం  అవుతోంది. అదే సమయంలో బాబు గురించి, ఏపీ గురించి ఎప్పటికపుడు సమాచారం రావాలంటే తన మనిషిగా సమర్ధులైన వారు  రాజ్ భవన్ లో  ఉండాలని మోడీ అనుకుంటున్నట్లుగా తెలుసోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మాత్రం ఏపీకి కిరణ్ బేడీ తొందరలోనే గవర్నర్ అవుతారని అంటున్నారు. ఇక ఇప్పటికే ఏపీ ఎన్నికల అధికారిగా సిసోడియాను మార్చి ద్వివేదీని నియమించిన నేపధ్యం ఉంది. తొందరలొన మరిన్ని కీలకమైన మార్పులు ఉంటాయని ఎన్నికల వేళ ఏపీని తన స్వీయ పర్యవేక్షణలోకి తెచ్చుకునేందుకు మోడీ వేస్తున్న కొత్త ప్లాన్ గా దీన్ని అంతా భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: