వైసిపికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నేత వంగవీటి రాధాకృష్ణ రాజీనామా చేశారు. వంగవీటి రాజీనామా చేస్తారని ఎప్పటి నుండో అనుకుంటున్నదే. రాబోయే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తనకే టిక్కెట్టివ్వాలని వంగవీటి పట్టుబడుతున్నారు. అయితే, విజయవాడ తూర్పు నుండి పోటీ చేయమని లేకపోతే మచిలీపట్నం ఎంపిగా పోటీ చేయమని జగన్ చెబుతున్నారు. దాంతో టిక్కెట్టు విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. ఇదే విషయం చాలా కాలంగా పార్టీలో నానుతోంది. ఇదే  విషయం ఆదివారం ఉదయం బొత్సా సత్యనారాయణ అండ్ కో మంతనాలు జరిపారు. చివరకు జగన్ వైఖరి స్పష్టం కావటంతో రాధా వైసిపికి రాజీనామా చేశారు.

 

వంగవీటి రాజీనామాతో విజయవాడలోని మిగిలిన నియోజకవర్గాల్లో క్లారిటీ వచ్చినట్లైంది. విజయవాడ సెంట్రల్లో మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో యలమంచిలి రవి పోటీ చేయబోతున్నారు. మొన్నటి వరకూ తూర్పు నియోజవర్గంలో రాధా వల్లే రవి కూడా అయోమయంలో ఉండేవారు. వంగవీటి రాజీనామా చేసేయటంతో రవికి టిక్కెట్టు క్లియర్ అయ్యింది. ఇక మరో మాజీ ఎంఎల్ఏ శ్రీనివాస్ కు టిక్కట్టు ఎక్కడ ఇస్తారో చూడాలి. అదే విధంగా మచిలీపట్నం, విజయవాడ లోక్ సభ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఫైనల్ చేసే విషయంలో కూడా జగన్ స్పష్టమైన వైఖరి తీసుకునేందుకు అవకాశం దక్కింది.

 

ఇక రాధా విషయానికి వస్తే  మొదటి నుండి రాధా తండ్రి వంగవీటి రంగా పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తున్నారంతే. తండ్రి ఇమేజిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన రాధా ఏనాడు సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నించినట్లు కనబడలేదు. మూడు ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిచింది ఒక్కసారి మాత్రమే. గెలిచిన ఒక్కసారి కూడా తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేశారు. రెండుసార్లు విజయవాడ సెంట్రల్ నుండి పోటీ చేసినపుడు ఓడిపోయారు.  తూర్పు నియోజకవర్గంలో గెలిచినపుడు కూడా ప్రత్యర్ధి బిజెపి అభ్యర్ధి కావటంతోనే గెలిచినట్లు కనబడుతోంది. కాబట్టి వంగవీటి వైసిపిలో ఉన్నా ఒకటే ఇతర పార్టీల్లోకి వెళ్ళినా ఒకటే అన్నట్లుగా ఉంది పరిస్దితి.


మరింత సమాచారం తెలుసుకోండి: