ప్రస్తుతం మోడీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరియు సామాన్యుల జీవితం ప్రజాస్వామ్యానికి ప్రమాదం చేకూరుతుందని భావిస్తున్న చాలామంది నాయకులు మోడీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే.

Related image

ఈ నేపథ్యంలో ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఈ కూటమిలో చాలా యాక్టివ్గా పాల్గొంటూ మోడీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి అంశాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

Image result for kavitha

ఈ నేపథ్యంలో దేశం బాగుపడాలంటే జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బిజెపియేతర పరిస్థితులు రావాలని భావించిన కేసీఆర్ దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి అడుగులు వేస్తున్నారు. అయితే మోడీకి వ్యతిరేకంగా  బెంగాల్ లో నిర్వహించిన ర్యాలీలో కెసిఆర్ దేనికి పాల్గొనలేదో కారణం తెలియజేశారు కవిత. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కవిత..తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలు తమకు చాలా ముఖ్యమని పేర్కొన్నారు.

Image result for kolkata rally

బిజెపి, కాంగ్రెస్ పార్టీలతో సంబంధం లేకుండా నిర్వహించే ర్యాలీల్లో భవిష్యత్తులో తమ పార్టీ పాల్గొంటుందని ఆమె చెప్పారు. ర్యాలీలో పాల్గొన్న నాయకులను చూస్తే వారు ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థమవుతుందని అన్నారు. కాంగ్రెసు, బిజెపిలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, అందువల్ల కేసీఆర్ జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ను ముందుకు తీసుకుని వెళ్లాలని నిర్ణయించారని ఆమె చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: