జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నం కేసును ఎన్ఐఏనే విచారిస్తుందని హై కోర్టు తేల్చేసింది. ఎన్ఐఏ విచారణపై స్టే ఇవ్వాలంటూ రాష్ట్రప్రభుత్వం వేసిన పిటీషన్ ను ఈరోజు హై కోర్టు కొట్టేసింది. విచారణను అడ్డుకుంటూ రాష్ట్రప్రభుత్వం వేసిన పిటీషన్ పై స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పేసింది. హత్యాయత్నం ఘటనపై సిట్ విచారణ తాలూకు వివరాలు మొత్తాన్ని సిట్ అధికారులు ఎన్ఐఏకి అప్పగించాల్సిందే అంటూ స్పష్టంగా ఆదేశించింది. మూడు రోజుల క్రితమే ఇదే కేసు విషయంలో ప్రభుత్వం మూవ్ చేసిన హౌజ్ మోషన్  పిటీషన్ ను కూడా కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే.

 

మొదటి నుండి కూడా హత్యాయత్నం కేసులో చంద్రబాబునాయుడు అనేక అడ్డంకులు సృష్టిస్తునే ఉన్నారు. సిట్ విచారణ పేరుతో హత్యాయత్నం కేసు తాలూకు అసలు నిజం వెలుగు చూడకుండా చేద్దామన్న తాపత్రయమే కనబడుతోంది చంద్రబాబులో. చంద్రబాబు ఉద్దేశ్యాన్ని గ్రహించిన జగన్ వెంటనే థర్డ్ పార్టీ విచారణ కోరుతూ హై కోర్టులు పిటీషన్ వేయటంతో చంద్రబాబుకు ఇబ్బందులు మొదలయ్యాయి. దానికితోడు హై కోర్టు కూడా జగన్ వాదనకు సానుకూలంగా స్పందిచి ఎన్ఐఏ విచారణకు ఆదేశించిన దగ్గర నుండి గగ్గోలో మొదలుపెట్టారు.

 

ఎన్ఐఏ విచారణను అడ్డుకుంటూ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారో అంతా చేశారు చంద్రబాబు. కానీ ప్రతీ ప్రయత్నంలోను విఫలమయ్యారు. చంద్రబాబు చేసే ప్రతీ ప్రయత్నం కూడా చంద్రబాబులోని ఆందోళననే స్పష్టం చేస్తోంది. ఎక్కడ ఎన్ఐఏ విచారణ జరిగితే హత్యాయత్నం ఘటన వెనకున్న సూత్రదారుల పాత్ర ఎక్కడ బయటపడుతుందో అన్న టెన్షనే చంద్రబాబు అండ్ కో లో కనబడుతోంది. దానికితోడు విచారణకు హాజరవ్వాల్సిన ఎయిర్ పోర్టు క్యాంటిన్ ఓనర్, టిడిపి నేత హర్షవర్దన్ చౌదరి పత్తా లేకుండా పోవటంతో అనుమానాలు మరింత పెరిగిపోయాయి. సరే కారణాలేమైనా ఒత్తిళ్ళను తట్టుకోలేకే చివరకు చౌదరి ఎన్ఐఏ విచారణకు హాజరైన విషయం అందరికీ తెలిసిందే. మరి తాజాగా హై కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఎన్ఐఏ విచారణలో ఏం తేలుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: