అందరివాడు ఇది మెగాస్టార్ మూవీ టైటిల్. ఇపుడు రాజకీయ తెరపై ఆదే టైటిల్ తమ్ముడు పవన్ కి బాగా యాప్ట్ అవుతుందని అంటున్నారు. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా రాజకీయాల్లో తనదైన మార్క్ వేసుకున్న పవన్ రెండు పార్టీల మధ్యన పోటీ అన్న మాటను మార్చేశారు. మొత్తానికి త్రిముఖ పోరుగా ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మలచడంలో ఆయన సక్సెస్ అయ్యారు. మరి పవన్ తన లక్ష్యాన్ని కూడా సాధిస్తారా.


పవన్ని ఏమీ అనొద్దు :


పవన్ కళ్యాణ్ ని ఏమీ అనవద్దు ఇది టీడీపీ అధినేత చంద్రబాబు గారి తాజా ఆదేశం. అందులోని పరమార్ధం తమ్ముళ్ళకు అర్ధం అయినా కాకపోయినా అధినేత మాట శిలాశాసనం కాబట్టి టీడీపీ నుంచి ఇకపై తిట్లూ శాపనార్ధాలు పవన్ కి ఉండవంటే ఉండవు. పైగా అయన మాటలను మంచిగా కోట్ చేస్తూ పసుపు పార్టీ నేతల ప్రసంగాలు ఉంటాయనడంలో సందేహం లేదు. ఇప్పటికే అధినేత చంద్రబాబు పవన్ అలా చెప్పారు మోడీ అన్యాయం చేశారని, ఇలా అన్నారు జగన్ ఏపీకి ద్రోహం చేస్తున్నారని అంటూ పవన్ని వాడేసుకుంటున్నారు. మరో వైపు పవన్ ఎప్పటికైనా తమవాడేనని ఇటు క్యాడర్ కి అటు జనాలకు చెప్పకనే చెప్పేస్తున్నారు. ఇంకోవైపు పవన్ని సైతం తన సాఫ్ట్ కార్నర్ వైఖ‌రితో ఆకట్టుకుంటున్నారు. ఇలా బహుళ‌ విధాలుగా బాబు మార్క్ పాలిట్రిక్స్ పవన్ మీద చేస్తున్నారు.


వైసీపీ కూడానా :


ఇక పవన్ డైరెక్ట్ గా టీడీపీతో చేతులు కలిపితే అది తమకు మంచిదేనని వైసీపీ భావిస్తోంది. ఆ పార్టీ నేతలా అంతర్గత సంభాషణల్లో పవన్ టీడీపీతో కలవరని, సొంతంగానే పోటీ చేస్తారని అంచనా వేస్తున్నారు. ఇక పవన్ విషయంలో  రేపటి ఎన్నికల్లో  తీసుకోవాల్సిన స్టాండ్ ఏంటన్న దానిపైన వైసీపీలోనూ ఆసక్తికరమైన అంశాలు బయటకు వస్తున్నాయి. పవన్ని ఏమీ అనవద్దు అంటూ వైసీపీలోనూ కాపు నాయకుల నుంచి హై కమాండ్ కి వినతులు వెళ్తున్నాయట. జగన్ సైతం పవన్ని పెద్దగా గతంలో విమర్శించినది లేదు పదే పదే తనను టార్గెట్ చేయడం వల్లనే ఆయన పవన్ పెళ్ళిళ్ల గురించి ప్రస్తావిచారు తప్ప మరేం కాదని కూడా అంటున్నారు. పవన్ విషయంలో ఇపుడు వైసీపీ కూడా సాఫ్ట్ కార్నర్ తోనే ఉంటుందని లేటెస్ట్ టాక్.


టీయారెస్ వ్యూహమా...:


దీని వెనక కూడా ఓ కధ ఉందని అంటున్నారు. టీయారెస్ నిజానికి ఏపీలో పవన్, జగన్ ఇద్దరినీ కలిపి బాబుకు వ్యతిరేక ఫ్రంట్ కట్టాలనుకుంది. అయితే ఎక్కడ బెడిసిందే కానీ ఇది కుదరలేదు. దాంతో పవన్ని ఎన్నికల తరువాత అయిన కలుపుకోవాలని, ఫెడరల్ ఫ్రంట్ లోకి తేవాలని  కేసీయార్ ప్లాన్ గా ఉంది. ఈ ఫ్రంట్ లో ఇప్పటికే ఉన్న వైసీపీ కూడా పవన్ విషయంలో ఇపుడు మెత్తగా ఉండాల్సివస్తోందని అంటున్నారు. రేపటి ఎన్నికల్లో ఏ పార్టీకి ఏపీలో మెజారిటీ రాకపోతే పవన్ కీలకం అవుతారన్నది టీయరెస్ అంచనా. అందువల్ల పవన్ని ఆడిపోసుకుని చెడగొట్టుకోవడం కంటే ఆయన్ని అలా వదిలేసి టీడీపీపైనే బాణాలు వేయాలని వైసీపీకి సూచిస్తున్నారుట.


అందరికీ ముద్దు ఆయనే :


వైసీపీలోనూ పవన్ పట్ల పెద్దగా వ్యతిరేకత లేదని కూడా అంటున్నారు.  మొత్తానికి చూసుకుంటే అటు టీడీపీ, ఇటు వైసీపీ కూడా రేపటి ఎన్నికల్లో పవన్ని పూర్తిగా టార్గెట్ చేసి హాట్ కామెంట్స్ చేసే అవకాశాలు లేవనే అంటున్నారు. ఇదంతా ముందస్తు  జాగ్రత్తలుగా చెబుతున్నారు. మొత్తానికి ఈ పరిణామాలు పవన్ శిబిరంలో హ్యాపీని పెంచుతున్నాయి. రేపటి రోజున పవన్ మాత్రం అందరి మీద రెచ్చిపోవచ్చు. కానీ ఆయన్ని గట్టిగా అనలేని బలహీనత మాత్రం ప్రధాన పక్షాలది అన్న మాట. ఎంతైనా  పవన్ ఇపుడు అందరికీ ముద్దు అవుతున్నారుగా.



మరింత సమాచారం తెలుసుకోండి: