ఇటీవల కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ తెచ్చిన ఆ చట్టాన్ని ఎపిలో అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీని ప్రకారం కాపులకు 5% రిజర్వేషన్లు ఇచ్చి మిగిలిన 5% ఇతర అగ్రకులాల పేదలకు ఇవ్వాలని నిర్ణయించింది ఇదే విషయంపై ఈ నెల 30 నుంచి ప్రారంభ మయ్యే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే రాబోయో ఎన్నికల నేపథ్యంలో, కాపుల ఓట్లను వారివైపు తిప్పుకొనే చర్యగానే భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.



దీన్ని బట్టి ఏపిలో చంద్రబాబుకు అగ్రవర్ణాల ఓట్లు శాశ్వితంగా కోల్పోయినట్లే. ఈ దేశంలో అగ్రవర్ణాల్లో పుట్టటమే తప్పుగా భావిస్తున్న సమయంలో పప్పుబెల్లాలు పంచినట్లు అగ్రవర్ణ పేదలకు ప్రధాని మోడీ ప్రభుత్వం ఏదో దయతలచి ఎన్నికల ముందైనా వారికి ఉపశమనం కలిగించటానికి పదిశాతం రిజర్వేషన్లు కలిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో అసలే బిచ్చమేసినట్లు ఇచ్చిన రిజర్వేషన్లలో ఐదు శాతం అగ్రవర్ణ పేదలకు మిగతా ఐదు శాతం కాపులకు రైజర్వేషన్లు పంచుతారట ఘనత వహించిన నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ అనుభవమున్న మన ముఖ్యమంత్రి శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు.

ఏపీలో కాపులకు 5% రిజర్వేషన్లు

జనాలకు మంట పుట్టిస్తున్నాయి. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వతలచుకుంటే ఇతరవార్గాల రిజర్వేషన్ల నుంచి యివ్వవచ్చుగా? అగ్రవర్ణ నిరుపేదలు అంత చీపుగా కనిపిస్తున్నారా? బహుశ చంద్రబాబు సామాజికవర్గంలో నిరుపేదలు లేరేమో? ఆయన పాలన ఇంతవరకు జరిగింది వారికోసమేగా! అందరూ సంపన్నులై ఉండే ఉంటారని అందుకే ఆయన ఆలోచనలలో ఈ దుర్మార్గం. ఏపిలో ఉన్న 39.50 శాతంగా అగ్రవర్ణాల బ్రహ్మణ క్షత్రియ వైశ్య రెడ్డి కమ్మ కాపు నుండి 15.50 శాతం కాపుల ఓట్లు పోతే 24 శాతం ఓట్లు చంద్రబాబుకు పడవని ఇప్పుడే తెలుస్తుంది. 
 

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: