మన దేశం చాలా గొప్పది. సువిశాలమైన ఈ దేశానికి పటిష్టమైన రాజ్యాంగం ఉంది. ఈ దేశంలోని పౌరుల హక్కులను కాపాడుతూ అందరూ ఆనందంగా జీవింతే విధంగా మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగానికి రూపకల్పన చేశారు. భారత దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలని, అది తిరుగులేకుండా ఉండాలని భావించి దేశంలోని ఎందరో మేధావులు, రాజనీతి కోవిదులు మూడేళ్ళ పాటు శ్రమ పడి రచించినది మన ఘనమైన రాజ్యాంగం 1946 నుంచి 1949 వరకూ మూడేళ్ళ పాటు రాజ్యాంగ రచన సాగింది.  


ఆ రోజు ప్రాధాన్యత :


1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు.  భారత రాజ్యాంగ సభలో 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు.


26కు ప్రత్యేకత :


జనవరి 26 నే ఇందుకు ఎంచుకోవడానికి చారిత్రికమైన కారణం ఉంది. 1930లో భారత జాతీయ కాంగ్రెస్‌ పూర్ణ స్వరాజ్‌ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు. భారతదేశానికి సంబంధించిన మూడు జాతీయ సెలవుదినాల్లో ఇది కూడా ఒకటి. ఇది కాక భారత స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి మిగిలిన రెండు జాతీయ సెలవులుగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: