ఈ దేశం కొన్నిశతాబ్దాల  పాటు పరాయి పాలనలో మగ్గింది. మన దేశాన్ని తురుష్కులు, ముస్లిములు, మొఘలాయీలు డచ్చివారు, బ్రిటిష్ వారు ఇలా అనేకమంది కలసి పాలించిన కాలం అక్షరాలా 1000 సంవత్సరాలు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినది 1947 ఆగస్ట్ 15. నాటికి ఈ దేశం పూర్తిగా చిన్నాభిన్నమై ఉంది. ఈ దేశానికి, దేశ భౌగోళిక సమస్యలకు తగినట్లుగా అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగం అవసరమైంది.


అంబేద్కర్ కీలక పాత్ర :


ఇక రాజ్యాంగ పరిషత్తును ఒకదాన్ని ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని రచించే ప్రక్రియకు పూనుకోవడం జరిగింది. 1946 జూలై 6న ఏర్పాటు చేయబడిన ఈ పరిషత్తులో సభ్యులుగా ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయి పటేల్. దేశ తొలి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం అజాద్ ఉన్నారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా అప్పటి న్యాయ శాఖ మంత్రి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వ్యవహరించారు. 1949 నవంబర్ 26 తో రాజ్యాంగ రచన పూర్తి అయింది. జనవరి 26వ తేదీతో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.


బలహీనులకూ హక్కులు :


మన రాజ్యాంగం గొప్పదనం ఏంటంటే  ఇక్కడ అందరూ సమానమే. కులం, మతం, వర్గం. వర్ణం వంటివి ఏవీ పట్టించుకోకుండా అందరూ ఈ దేశ పౌరులేనని చాటి చెబుతోంది. ఈ దేశంలో అందరూ సమాన అవకాశాలు, స్వేచ్చా స్వాంతంత్రాలు కలిగి ఉంటారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ అంతా కలసి సమ ధర్మం సూత్రంగా ఒకే దారంలోని పూలలా కలసి మెలసి జీవించాలని మన రాజ్యాంగం చెబుతోంది. మనది లౌకికవాద, ప్రజాతంత్ర రాజ్యాంగం. మన రాజ్యాంగం పౌరులందరికీ ఓ భగవద్గీత. అందరూ కచ్చితంగా పాటిస్తూ ఈ దేశాన్ని ప్రపంచంలోనే గొప్పగా ముందుకు తీసుకుపోవాలన్నది రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్ష.
 



మరింత సమాచారం తెలుసుకోండి: