2019 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు జారీ పోవడం చంద్ర బాబు ను కలవర పెడుతుంది. ఇప్పటికే రాజంపేట ఎమ్మెల్యే మల్లిఖార్జున పార్టీ మారి జగన్ పార్టీ ఖండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ పెట్టి, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పార్టీని భ్రష్టుపట్టించేస్తున్నారు. 

Image result for chandrababu and jagan

అఫ్‌కోర్స్‌ అన్ని సర్వేలూ వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఫలితాలొస్తాయని తేల్చేస్తున్నాయనుకోండి.. అది వేరే సంగతి. బహుశా ఆ బెంగతోనే చంద్రబాబుకి తానేం చేస్తున్నానో అర్థం కాని పరిస్థితి ఏర్పడినట్టుంది. లేకపోతే, టీడీపీ నుంచి ప్రజా ప్రతినిథులు జారిపోతోంటే, చంద్రబాబు 'పోతే పోండి..' అన్నట్టు ఎలా వ్యవహరిస్తారు.? ఎలాగోలా వారిని బుజ్జగించుకోవాలి కదా. మొన్నామధ్యన ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు టీడీపీని వీడి, జనసేన పార్టీలోకి వెళ్ళిపోయారు.

Image result for chandrababu and jagan

తాజాగా టీడీపీకి గుడ్‌ బై చెప్పేశారు మరో ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్‌రెడ్డి. నిజానికి చంద్రబాబు, మేడా మల్లికార్జున్‌రెడ్డిని బుజ్జగించాల్సింది పోయి, పార్టీ నుంచి సస్పెండ్‌ చేసేశారు. అంతకు ముందే మేడాకి ఓ రేంజ్‌లో పొగపెట్టేశారు చంద్రబాబు. ఈ టార్చర్‌ భరించలేక మేడా, టీడీపీకి గుడ్‌ బై చెప్పి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పంచన చేరిపోయారు.  ఇక్కడితో ఈ చేపల దూకుడు వ్యవహారం ఆగేలా కన్పించడంలేదు. రానున్న పది పదిహేను రోజుల్లో మరో ఆరుగురు ఎమ్మెల్యేల వరకు టీడీపీని వీడే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. రేసులో ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్‌ బై చెప్పబోతున్నారట. రాయలసీమ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, అమరావతి పరిధిలో ఓ ఎమ్మెల్యే టీడీపీకి ఝలక్‌ ఇస్తారంటూ గుసగుసలు విన్పిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: