కడప జిల్లా లో 2014లో టీడీపీ ఒకే ఒక సీటు ను స్వంతం చేసుకున్నది . అదే రాజం పేట సీటు అయితే ఆ ఎమ్మెల్యే కూడా వైసీపీ ఖండువా కప్పేసుకున్నాడు. అయితే ఇంకా కొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు బయటికి రానున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్న మాటలు. సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉంటూ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మేడా మల్లికార్జున రెడ్డి విజయం సాధించారు.

Image result for chandra babu

జిల్లా మొత్తం మీద ఒకే ఒక్క ఎమ్మెల్యేగా మేడా గెలవడంతో ఆయనకు చంద్రబాబు విప్ పదవిని కట్టబెట్టారు. అయితే వైఎస్ అనుచరుడని పేరుండటంతో ఆయనకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదనే చెప్పాలి. గడచిన నాలుగున్నరేళ్లుగా పార్టీలో తనకు ఎదురవుతున్న అవమానాలను పంటి బిగువుననే భరిస్తూ వస్తున్న మేడా... టీడీపీని వదలాలని ఏనాడూ అనుకోలేదు. అయితే టీడీపీ గ్రూపు రాజకీయాలు - వైసీపీ టికెట్ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించి ఏకంగా మంత్రి పదవిని దక్కించుకున్న ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు రాజంపేటలో మకాం పెట్టేశారు.

Image result for chandra babu

మేడాను పక్కనపెట్టేసి... తన అనుచర వర్గానికి టికెట్ ఇప్పించుకోవాలని చాలా సైలెంట్గానే పావులు కదిపిన ఆది... మేడాకు తీవ్ర ఆగ్రహాన్నే తెప్పించారు. అయినా కూడా మేడా పార్టీ మారే యోచనకు రాలేకపోయారు. ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీని ఆ పదవి కాలం ముగియకుండా పార్టీ ఫిరాయించే ఆలోచన తన దరికే చేరనీయలేదు. అయితే టీడీపీ తరహా గ్రూపు రాజకీయాలు మేడాను పార్టీ వీడేలా చేశాయని చెప్పాలి. ఇదిలా ఉండగా, టీడీపీలో నుంచి పలువురు నేతలు బయటకు వెళ్లడం ఆ పార్టీని ఆందోళనకు గురి చేస్తున్నట్లుగా ఉందని చెబుతున్నారు. కర్నూలులో అఖిలప్రియ తీరుతో రెండోస్థాయి నేతలు, ఇప్పుడు కడపలో మేడ మల్లికార్జున రెడ్డి వెళ్లారు. అలాగే, మాజీ మంత్రి రావుల కిషోర్ బాబు కూడా అంతకుముందు పార్టీని వీడారు. ఎన్నికలకు ముందు ఇది టీడీపీకి ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: