సినీ నటుడు ప్రభాస్‌తో తనకు అక్రమ సంబంధం అంటగడుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. షర్మిల పై దుష్ప్రచారం చేస్తున్న వీడియోలను పోలీసులు గుర్తించారు.

sharmila prabhas కోసం చిత్ర ఫలితం


యూట్యూబ్‌లో షర్మిలపై ఇలా గాసిప్స్‌ పోగేసి తయారు చేసిన వీడియోలు వందల సంఖ్యలో ఉన్నాయట. దాదాపు 50 వరకూ యూట్యూబ్‌ ఛానళ్లు వీటిని పోస్టు చేశాయి. వీటన్నింటినీ పరిశీలించిన పోలీసులు ప్రాధమిక ఆధారాలు లభించిన 8 ఛానల్లపై కేసులు నమోదు చేశారు.

sharmila prabhas కోసం చిత్ర ఫలితం


మహిళల గౌరవానికి భంగం కలిగించారన్న కారణంతో ఐపీసీ 506 సెక్షన్‌ కింద.. ఐటీ చట్టం 67 సెక్షన్‌ కింద ఈ కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులను ప్రశ్నించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వారి ఈ మెయిల్ ఐడీల ఆధారంగా వారిని గుర్తించేందుకు సాంకేతిక నిపుణుల సాయం తీసుకుంటున్నారు.

sharmila prabhas కోసం చిత్ర ఫలితం


కేవలం యూట్యూబ్ వ్యూస్ కోసమే ఇలా ప్రచారాలు చేస్తున్నారా.. లేక వీరి వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా అన్నకోణంలోనూ దర్యప్తు చేస్తారు. వీడియోల్లో షర్మిల ఫోటోలను మార్ఫింగ్ చేశారా లేదా అనే విషయాలనూ పరిశీలిస్తారు. మొత్తానికి ఈ వీడియోల సంఖ్యను చూస్తే షర్మిలపై దుష్ప్రచారం ఏ రేంజ్‌లో జరిగిందో తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: