ఏపీ రాజకీయం నెమ్మదిగా ఓ రూపు కట్టుకుంటోంది. బలమైన మీడియా చూపులను దాటి అది కొంత వాస్తవికమైన పరిస్థితుల్లోకి వస్తోంది. అంతా బాగుందన్న నినాదాలు, అనుకూల మీడియ భజంత్రీల మధ్యా ఏమీ తెలియని గందరగోళం చెలరేగుతున్న వేళ గాలి ఎటు వీస్తోందన్నది తెలియని పరిస్థితి ఇంతకాలం ఉంటూ వచ్చింది. అయితే ఇపుడిపుడే పొద్దు కనిపిస్తోంది 


బాబులో కంగారు :


ఏపీ ముఖ్యమంత్రి రాజకీయ దురంధరుడు చంద్రబాబులో ఎక్కడ లేని కంగారు కనిపిస్తోందిపుడు, నిజానికి ఏడాది కాలంగా ఆయన చాలా ఆరాటపడుతూనే ధర్మ పోరాటాలు చేస్తూ వస్తున్నారు. ఇపుడు కొత్త ఏడాది వచ్చేసింది. ఎన్నికలు చూస్తే వంద రోజులు కూడా గడువు లేదు. దాంతో బాబు లో ఏదో తెలియని కలవరం కనిపిస్తోంది. అది ఆయన మాటల్లో, చేతల్లో కూడా తెలిసిపోతోంది. తన పాలన భేష్ అని నిబ్బరంగా ఉండాల్సిన చంద్రబాబుతో భయం ఆవహిస్తోంది. అందుకే నిన్నటి వరకూ సాగించిన అద్భుతమైన పాలన గురించి చెప్పుకోకుండా పప్పు బెల్లాల పందేరాలకు తెర తీశారు. 


కాపీ కొట్టి మరీ :


మరో వైపు నలభయ్యేళ్ళ అనుభవం, ఎంతో మంది సీనియర్లు చుట్టు ఉన్నారు. నిత్యం పార్టీలో మధనం జరుగుతుంది. అయినా అయనకు, ఆయన గారి పార్టీకి పుట్టని ఆలోచనలు వైసీపీకి పుట్టాయా. ఏ మాత్రం పాలనానుభవం లేదని చులకనగా చూసే జగన్ నుంచే పధకాలు కాపీ కొట్టడం చూస్తూంటే బాబు వద్ద ఆయుధాలు ఏమీ లేవా అనిపించకమానదు. నవ రత్నాలు అంటూ వైసీపీ ప్రకటించిన వాటిల్లో సామాజిక పించన్లు రెట్టింపు చేయడం, రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ అందించదం వంటివి అమల్లో పెట్టిన చంద్రబాబు. రైతులకు భరోసా అంటూ వైసీపీ పెట్టిన మరో పధకాన్ని రైతు రక్ష పేరిట అమలుచేయనున్నారని తెలుస్తోంది. అంటే తొమ్మిది రత్నాలలో మూడింటిని అపుడే టీడీపీ వాడేసింది. అయినా  అమ్మ ఒడి, ద్వాక్రా మహిళలకు మేళ్ళు వంటి పధకలు ఎన్నో నవరత్నాల్లో ఉన్నాయి. వాటిని సైతం ఇపుడు చూసి కాపీ కొడతారని ఓ వైపు వైసీపీ నిందారోపణలు చేస్తోంది.


ఈవీఎంల మీద పడి :


ఇక వచ్చే ఎన్నికలూ ఎటూ ఈవీఎం ల తోనే జరుగుతాయి. చంద్రబాబు అపుడే ఈవీఎం ల మీద పడి గగ్గోలు పెడుతున్నారు. ఈవీఎం ల తో ఎన్నికలకు వెళ్తే తిమ్మిని బమ్మిని చేస్తారని, గెలుపు కోసం హ్యాకింగ్ చేస్తాని ఆరోపణలు గుప్పిస్తున్నారు. నిజానికి ఇక్కడ బాబు అధికారంలో ఉన్నారు. పైగా టెక్నాలజీ అంటే ఆయనకు ఎంతో మోజు. అన్నీ నేనే కనిపెట్టాను.. తెచ్చాను అని చెప్పుకునే బాబు ఇపుడు ఈవీఎం లు వద్దు అనడంలో అర్ధం ఉందా. పైగా పవర్లో ఉన్న పార్టీ ఇలా పెడబొబ్బలు పెట్టడం చూస్తూంటే ఒకవేళ ఓడిపోతే కారణాలు ఇప్పటి నుంచే వెతుక్కుంటోందని విపక్షాలు అపుడే వేళాకోళం చేస్తున్నాయిగా. 


అక్కడ జనం వస్తే :


ఇక రోజుకు వంద మార్లు మీడియాతో, క్యాడర్ తో, మంత్రులతో మీటింగులు పెట్టి మనమే గెలుస్తున్నాం అని చెప్పుకోవడం ఆత్మ న్యూనతా భావం లో పదిపోతున్నారని చెప్పకనే చెబుతోంది. అలాగే ఓటమి భయాన్ని కూడా బయటేస్తోంది. తరచూ ఆ పార్టీని ఈ పార్టీని కలసి మేము బలంగా ఉన్నామని చెప్పుకోవడం కూడా అందులో భాగమే. ఏపీలో బాబు గెలవాలంటే టీడీపీకి ఓట్లు పడాలి. అంతే తప్ప మమతా బెనర్జీ ర్యాలీకి జనం వస్తేనో, కర్నాటకలో కుమారస్వామికి కిరిటం పెడితేనో ఇక్కడ టీడీపీ గెలవదు. అక్కడ ముచ్చట్లు ఇక్కడ చెబితే పార్టీ వారు ఒహో అంటారేమో కానీ జనాలో గ్రాఫ్ ఎలా పెరుగుతుంది. ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ  బాబుకు ఈ సంగతి తెలియదు అనుకోవాలా. తెలిసిన తనతో పాటు అందరినీ మభ్యపెడుతూ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారా... 


మరింత సమాచారం తెలుసుకోండి: