సోషల్ మీడియా.. ఇదో విప్లవాత్మకమైన పరిణామం.. ప్రధాన మీడియా కొన్ని పార్టీలకు కొమ్ముకాస్తూ అసలు వాస్తవాలను దాచి పెడుతున్న తరుణంలో ఎన్నో విషయాలు ఈ సోషల్ మీడియా ద్వారా వెలుగుచూస్తున్నాయి. సత్తా ఉన్న ఎవరైనా తమకు తెలిసిన నిజాన్ని ప్రపంచానికి చాటే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అదే సోషల్ మీడియా కొందరు ముష్కరుల పాలిట అస్తంగా మారింది.

sharmila prabhas కోసం చిత్ర ఫలితం


దుష్ప్రచారాలకూ, బురద జల్లుడు కార్యక్రమాలకు సోషల్ మీడియా వేదిక అవుతోంది. ప్రత్యేకించి యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సప్‌ ఇలాంటి దుష్ప్రచారాలకు కేరాఫ్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధితులు బయటకు వస్తున్నారు. ప్రభాస్‌తో తనకు సంబంధం అంటగడుతూ జరుగుతున్న ప్రచారంపై షర్మిల గళం విప్పిన తర్వాత మిగిలిన వారూ ధైర్యం చేస్తున్నారు.

ka paul comedy కోసం చిత్ర ఫలితం


తాజాగా కేఏ పాల్ కూడా తనపై జరుగుతున్న ప్రచారాన్ని అరికట్టాలని హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. ఈయనపై కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంటుంది. ఈయన్ను చాలా మంది లాఫింగ్ స్టాక్‌ గా భావిస్తూ వీడియోలు పోస్టు చేస్తున్నారు.

ka paul comedy కోసం చిత్ర ఫలితం


నిన్న షర్మిల, నేడు కేఏ పాల్.. రేపు ఇంకెవరో.. ఏదేమైనా సోషల్ మీడియా దుష్ప్రచారంపై షర్మిల ప్రారంభించిన పోరాటం మంచిదే. చేతిలో కంప్యూటర్ ఉన్నప్రతి ఒక్కడూ అడ్డమైన రాతలు రాసి, పోస్టులు పెట్టే సంస్కృతికి ఇకనైనా అడ్డుకట్టుపడుతుంది. అందుకే అంటారు అతిసర్వత్రవర్జయేత్ అని.


మరింత సమాచారం తెలుసుకోండి: