ఏపీలో మూడు ప్రధాన‌మైన రీజియన్స్ ఉన్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ. నవ్యాంధ్ర అంతా ఒకేలా ఉంటున్నా కొన్ని తేడాలు ఈ రీజియన్లలో కనిపిస్తాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనకబాటు తనానికి పెట్టింది పేరుగా ఉన్నాయి. సీమ వాసులు నవ్యాంధ్రలో ఉన్నా వారు అభివ్రుధ్ధిలో భాగం కాలేకపోతున్నామని బాధలో ఉన్నారు. . ఉత్తరాంధ్ర కూడా అలంటిదే. ఈ పరిణామలు కూడా రేపటి ఎన్నికల్లో తీర్పును మారుస్తాయంటున్నారు. 


సీమలో మళ్ళీ :


సీమలో 2014 ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ సీట్లను గెలుచుకుంది. ఒక్క అనంతపురం తప్ప మిగిలిన చిత్తూరు, కడప, కర్నూల్ జిల్లాలో వైసీపీ ప్రాభవం కొనసాగింది. ఇంకా  అనుకుని ఉన్న ప్రకాశం, నెల్లూరులలో కూడా వైసీపీ గాలి బాగానే వీచింది. ఇపుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్న వేళ సీమలో రాజకీయం రంజుగా ఉంది. కడపలో ఒకే ఒక్క సీటు తో చావు తప్పి కన్ను లొట్టబోయిన టీడీపీకి ఎన్నికల ముందే గట్టి దెబ్బ తగిలింది. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి సైకిల్ దిగిపోయి వైసీపీ పంచన చేరారు. దాంతో సీమ రాజకీయాలు ఎటు మారుతున్నాయో మరో మారు బయట ప్రపంచానికి తెలిసాయి. ఇన్నాళ్ళూ టార్గెట్ జగన్ అన్నట్లుగా కడపలో టీడీపీ సాగించిన పోరాటం అంతా ఒక్క దెబ్బతో తేలిపోయింది. ఈ పరిణామాలు సీమలో మళ్ళీ వైసీపీకి అధికారం ఖాయమన్న దాన్ని రుజువు చేస్తున్నాయి.


పట్టు పెరిగింది :


ఇక కడపలో వైసీపీ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు  లేకపోగా కర్నూలు, చిత్తూరులలో పట్టు బాగానె ఉంది. అనంతపురంలో గతసారి టీడీపీకి మెజారిటీ సీట్లు వచ్చాయి. ఈసారి మాత్రం ఆ సీన్ లేదంటున్నారు. మొత్తానికి చూసుకుంటే సీమలో గతం కంటే వైసీపీకి ఈ మారు సీట్లు ఎక్కువగా వస్తాయనే అంటున్నారు. వీటికి తోడు నెల్లూరు, ప్రకాశం లో కూడా వైసీపీ బలం పెరిగింది. ఈ విధంగా చూసుకుంటే ఎన్నికల ముందు మేడ చేసిన  జంపింగ్ సీమలో సీన్ ఏంటన్నది చాటి చెప్పినట్లైంది.


అది కూడా కారణం :


ఇక రాయలసీమ వాసులు విభజన తరువాత తమ ప్రాంతం అభివ్రుద్ధిపై గొప్ప ఆశలు పెట్టుకున్నారు. మొదట రాజధాని కోసం డిమాండ్ చేశారు. అది గుంటూరుకు వెల్ళిపోయింది. తరువాత హై కోర్టు అడిగారు. అది కూడా అక్కడికే వచ్చేసింది. ఇపుడు బెంచ్ అడుగుతున్నారు. అయినా వారిలో ఎక్కడలేని అసంత్రుప్తి ఉంది. ఆంధ్ర రాష్ట్రంగా మద్రాస్ నుంచి విడిపోయాక శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం సీమకు ఎంతో అభివ్రుద్ధి రావాలనుకున్నారు. రాజధాని అప్పట్లో కర్నూల్లో పెట్టారు. ఇపుడు మళ్ళీ కధ మొదటికి వచ్చి గుంటూరుకు వెళ్ళిపోయింది. ఇలా నీరు, నిధులు, ఉపాధి వంటి వాటి విషయంలో సీమ వాసులు రగులుతున్నారు. టీడీపీ సైతం కేంద్రీక్రుత విధానాలు అమలు చేస్తోంది. దాతో సహజంగా అధికార పార్టీపై వ్యతిరేకత ఉంది. దానికి రాజకీయం కూడా తోడు అయింది. అదిపుడు వైసీపీకి వరంగా మారుతోంది. రానున్న రోజుల్లొ వైసీపీ తీసుకునే నిర్ణయాల బట్టి రాయలసీమలో  ఆ పార్టీ విజయాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: