జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2018 వ సంవత్సరం లో మార్చి నెలలో గుంటూరు లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయి. ఈ క్రమంలో టీడీపీ ని వదిలి గుంటూరు వేదికగా చంద్రబాబుపై ఆయన కుమారుడు లోకేష్ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా ఎవరు మర్చిపోలేరు.

Image result for pawan kalyan guntur meeting

ఈ క్రమంలో త్వరలో ఏపీ లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఆ సమయంలో పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు కేవలం వామపక్షాలతో తప్ప వేరే పార్టీలతో కలిసే ప్రసక్తి లేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరియు కొద్ది నెలలలో రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఈ నెల 27 వ తారీఖున గుంటూరు లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి పవన్ కళ్యాణ్ వస్తుండటంతో గుంటూరులో జరిగే భారీ బహిరంగ సభ పై ఆసక్తి నెలకొంది.

Image result for pawan kalyan guntur meeting

మరోపక్క ఈ సభకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు అభిమానులు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న జనసేన కార్యకర్తలు, పవన్‌కళ్యాణ్‌ అభిమానులు పెద్దఎత్తున సభకు హాజరుకానున్న నేపథ్యంలో సభాస్థలి పరిశీలనలో నేతలు మునిగిపోయారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశాలున్న తరుణంలో అందుకు తగిన ఏర్పాట్లు, కార్యక్రమ విజయవంతానికి చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యనేతలు సమాలోచన చేస్తున్నారు.

Image result for pawan kalyan guntur meeting

పార్టీ అధినేతగా తొలిసారి గుంటూరు నగరానికి రానున్న పవన్‌కు భారీగా స్వాగతం పలికేందుకు కార్యకర్తలు నిమగ్నమయ్యారు. మరోపక్క తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ కలుస్తుందని వార్తలు రావడంతో ఈ సభా స్థలం నుండి మరొకసారి పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు పార్టీ నుండి వస్తున్న సమాచారం. మొత్తంమీద చూసుకుంటే పవన్ కళ్యాణ్ గుంటూరు సభ మరొకసారి ఏపీ రాజకీయాలలో సంచలనం అవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: