కాలం కలసి రాకపోతే ఎంతటి నాయకులకైనా తాడే పాము అవుతుంది. ఒకనాడు పెద్ద మనుషులుగా, నేతలుగా ఉన్న వారు తరువాత కాలంలో ఏమీ కాకుండా పోతారు. కాలు జారితే వెనక్కు తీసుకోగలం కానీ,   నోరు జారితే అంతే మరి.. మరి ఈ సామెత తెలిసి కూడా టీజీ అలా మాట్లాడితే ఎలా. పెద్దరికం పరువు రెండూ పోతాయి కదా.


మంత్రిగా చక్రం :


కాంగ్రెస్ రాజకీయాల్లో టీజీ వెంకటేష్ హవాయే వేరు. కర్నూల్ జిల్లాలో చక్రం తిప్పిన నాయకుడు ఆయన. అలాగే కాంగ్రెస్ లో  పెద్ద తలకాయల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న వారు కూడా. విభజన తరువాత కాంగ్రెస్ మట్టి కొట్టుకుని పోతే టీజీ తదితరులంతా టీడీపీ పంచన చేరారు. బాబును బతిమాలో బామాలో రాజ్యసభ సభ్యత్వం టీజీ సంపాదించగలిగారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఇపుడు అనవసర కెలుకుడుతో టీజీ జనంలో పలుచన అయిపోతున్నారు. లేటేస్ట్ గా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ జనసేనానికి ఎక్కడో మండాయి. అంతే కౌంటర్లు వేసేసారుగా.


పరువు తీసారుగా :


టీజీ వెంకటేష్ గురించి విశాఖ జిల్లా పాడేరు సభలో పవన్ మాట్లాడుతూ పరువు తీసేశారు. టీజీ నోరుని అదుపులో పెట్టుకోమని కోరారు. టీజీవి పిచ్చి ప్రేలాపనలు అనేశారు. టీజీ తాను వదిలేసిన రాజ్యసభ సీటు తీసుకున్నారంటూ నిప్పులు కక్కారు. నదులు, పర్యావరణం దెబ్బ తీసిన పారిశ్రామికవేత్త అంటూ టీజీపై ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. మరో సారి నోరు జారితే బాగోదు అని కూడా వార్నింగు ఇచ్చారు. తాను నోరు జారితే ఏమవుతారో అంటూ కౌటర్లేశారు. మొత్తానికి పవన్ టీజీ మీద వీరావేశమే ప్రదర్శించారు.
ఇంతకీ టీజీ అన్నదేంటి అంటే జనసేనా టీడీపీ పొత్తులు పెట్టుకుంటాయనిట. దీని మీద పవన్ అన్న మాటలు టీజీ పరువుకే ఎసరు పెట్టాయి. ఆ మీదట అధినేత చంద్రబాబు కూడా టీజీ మీదనే అసహనం వ్యక్తం చేశారు. మొత్తానికి చూసుకుంటే టీజీ తన పని మానేసి అధినేతల స్థాయి పనులు, మాటలు మాట్లాడారనుకోవాలి. తనది కానిది చేసే ఫలితాలు ఇలాగే ఉంటాయి కదా మరి.మొత్తానికి పాపం టీజీ అంటున్నారంతా..


మరింత సమాచారం తెలుసుకోండి: