టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. తెలంగాణ జర్నలిస్టుల కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. చంద్రబాబు తీరుపై విమర్శలు గుప్పించారు. ఏపీలో చంద్రబాబు జర్నలిస్టులకు స్థలాలు ఇస్తున్న విషయంపై స్పందించిన కేటీఆర్.. చంద్రబాబు ఎన్నికల ముందు జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు.

ktr vs chandrababu కోసం చిత్ర ఫలితం


అన్ని విషయాల్లోనూ చంద్రబాబు కేసీఆర్ ను కాపీకొడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఏపీలో చంద్రబాబు పాలనకు టైమ్ దగ్గర పడిందన్న కేటీఆర్.. ఎన్నికల్లో గెలిచేందుకు తెలంగాణలో టీఆర్‌ఎస్ అమలుచేసిన పథకాలను కాపీ కొడుతున్నారని కామెంట్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ సంక్షేమ పథకాల ద్వారానే మళ్లీ అధికారంలోకి వచ్చారని భావించిన చంద్రబాబు ఇప్పుడు హడావిడిగా వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

సంబంధిత చిత్రం


తాము మూడేళ్ల కిందటే ఆటోలు, ట్రాక్టర్లకు లైఫ్ ట్యాక్స్ తీసేశామని ఇప్పుడు బాబు కాపీకొడుతున్నారని కేటీఆర్ అన్నారు. రైతు బంధు, ఫింఛన్ల పెంపు వంటి వాటిని కూడా చంద్రబాబు యాజ్ ఇట్ ఈజ్‌ గా కాపీకొడుతున్నారన్నారు. కానీ ఎన్నికల ముందు చేసే ఇలాంటి జిమ్మిక్కులను ఏపీ ప్రజలు నమ్మరని కేటీఆర్ అంటున్నారు.

ktr కోసం చిత్ర ఫలితం


ఆంధ్రప్రజలు విజ్ఞులు.. వాళ్లు ఇలాంటి నక్క జిత్తులను నమ్మి ఓట్లు వేయరని తాను భావిస్తున్నానని కేటీఆర్ అంటున్నారు. తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు, హెల్త్ కార్డుల విషయంలో తాను బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ అన్నారు. కోర్టు వివాదాలకు తావులేకుండా ఎవరూ వేలెత్తి చూపకుండా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: