ఏపీలో కాంగ్రెస్ పార్టీ సొంతంగా బరిలో దిగాలని నిర్ణయించింది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని మొత్తం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు సొంతంగానే పోటీ చేస్తామని అధికారికంగా ప్రకటించేసింది. అంటే ఇక ఏపీలో సింగిల్ హ్యాండేనన్నమాట.



అదేంటి.. రాహుల్ - చంద్రబాబు కలిశారుగా.. కలిసిపోరాడతామన్నారుగా... తాజాగా ఢిల్లీలోనూ మరోసారి బేటీ అయ్యారుగా అంటారా.. అంతే.. అక్కడే ఉంది చంద్రబాబు చాణక్యనీతి. ఢిల్లీలో రాహుల్‌ను చంద్రబాబు కలిసిన మరుసటి రోజే కాంగ్రెస్ ఈ ఒంటరి పోరాటం ప్రకటన చేయడం విశేషం.

raghuveera reddy కోసం చిత్ర ఫలితం


ఏపీలో విజయంపై కాంగ్రెస్ హైకమాండ్ కు ఎలాగూ ఆశలు లేవు. అక్కడ సీట్లు వస్తాయని నమ్మకం లేదు. అందుకే రాహుల్ బాబు చెప్పినట్టు చేస్తున్నారు. కాంగ్రెస్ ఒంటరిగా బరిలో దిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తుంది.



కొంతలో కొంత వరకైనా వైసీపీ ఓటు బ్యాంకును చీలుస్తుంది..ఇదీ చంద్రబాబు ఆలోచన. అందులోనూ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే జనం ఎలా తీసుకుంటారోనన్న భయం కూడా ఉంది. తెలంగాణలో ఆ ప్లాన్ ఫెయిలైందిగా.. అందుకే జగన్‌ను దెబ్బకొట్టేందుకు ఇలా చంద్రబాబు ప్లాన్ రెడీ చేశారు. మరి ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో.. ?


మరింత సమాచారం తెలుసుకోండి: