తెలంగాణా దెబ్బకు ఏపిలో చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీని వదిలించుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్నీ స్ధానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని ఏపి ఇన్చార్జి ఊమెన్ చాంది ప్రకటించటం ఇందులో భాగమనే చెప్పాలి. తెలంగాణాలో కాంగ్రెస్, టిడిపి పొత్తు వర్కవుట్ అయ్యుంటే ఏపిలో ఈపాటికే రెండు పార్టీలు రెచ్చిపోయేవనటంలో సందేహం లేదు. కానీ ఊహించని రీతిలో బోర్లా పడటంతో చంద్రబాబు ముందుగానే మేల్కొన్నారు. తెలంగాణాలో  ఒంటరిగా టిడిపి అధికారంలోకి వచ్చే పరిస్దితి లేదు.కాబట్టి కాంగ్రెస్ తో పొత్తులని, మహాకూటమి అని పెద్ద షో చేశారు. కానీ చంద్రబాబు షోను జనాలు తిప్పికొట్టారు.

 Image result for mahakutami and chandrababu

అయితే, ఏపిలో పరిస్ధితి వేరు. తెలంగాణాలో మహాకూటమి అధికారంలోకి వచ్చివుంటే చంద్రబాబు బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేయాల్సిందే. అదే ఏపి విషయానికి వస్తే కాంగ్రెస్ అసలు సోదిలోకి కూడా కనబడదు. మొత్తం షో చంద్రబాబుదే. ఈ పరిస్ధితుల్లో తెలంగాణాలో బోర్లాపడినా చంద్రబాబుకు వచ్చిన నష్టం లేదు.  ఏపిలో కూడా తెలంగాణా ఫలితమే రిపీటైతే చంద్రబాబు పరిస్దితి గోవింద. అందుకనే ముందుజాగ్రత్తగా జనసేనను చంద్రబాబు లైన్లో పెడుతున్నారు. ఒకవేళ చంద్రబాబు గోకుడుకి లొంగిపోతే పవన్ మాత్రమే చంద్రబాబు పొత్తు పెట్టుకుంటారు.  

 Image result for mahakutami and chandrababu

 పవన్ తో పొత్తులు పెట్టుకునే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ ను చంద్రబాబు పక్కన పెట్టేస్తున్నారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే జరగబోయే నష్టాన్ని ఏఐసిసి అధ్యక్షుడు రాహూల్ గాంధికి చంద్రబాబు ఢిల్లీలో కలిసి వివరించారని సమాచారం. కాకపోతే కాంగ్రెస్ తరపున పోటీ చేయబోయే అభ్యర్ధుల ఖర్చులను తానే భరిస్తానని రాహూల్ కు హామీ ఇచ్చారట. అందుకని అభ్యర్ధులను కూడా చంద్రబాబే ఎంపిక చేస్తారో ఏమో ? ఇక పవన్ తో పొత్తులుంటే జనసేన అభ్యర్ధుల ఖర్చులను కూడా చంద్రబాబే భరించాల్సుంటుదేమో ? పవన్ తో పొత్తులు పెట్టుకుంటే  టిడిపికి ప్లస్ అని అదే కాంగ్రెస్ తో పొత్తులుంటే మైనస్ అని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.

 Image result for mahakutami and chandrababu

నిజానికి ఏపిలో కాంగ్రెస్ తో పొత్తులున్నా లేకపోయినా టిడిపికి మైనస్సే అనటంలో సందేహం అవసరం లేదు. ఎందుకంటే, తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకుని చంద్రబాబు బోర్లా పడిన విషయం ఏపిలో అందరూ చూసిందే. తెలంగాణలో జరిగే విషయాలను ఏపిలో జనాలు చూడటం లేదని బహుశా చంద్రబాబు అనుకుంటున్నట్లుంది. అందుకనే తనిష్టం వచ్చినట్లు ప్లాన్ చేస్తుంటారు. చంద్రబాబు ఉద్దేశ్యంలో రాజకీయాలను తానిష్టం వచ్చినట్లు శాసించగలరని అనుకుంటున్నారు.  మీడియా సపోర్టుతో ఎప్పుడో ఒకసారి సక్సెస్ అయితే అయ్యుండొచ్చు చంద్రబాబు. అంతేకానీ ప్రతీ ఎన్నికలోను మీడియా చెప్పినట్లు జనాలు వింటారనుకుంటే తప్పులో కాలేసినట్లే. మొన్నటి తెలంగాణాలో ఏం జరిగిందో అందరూ చూసిందే.

 Image result for mahakutami and chandrababu

అందుకనే రాబోయే ఎన్నికల విషయంలో చంద్రబాబు కాంగ్రెస్ ను పక్కన పడేస్తున్నారు. ఏపిలో కాంగ్రెస్ తో పొత్తులుండవట. కానీ జాతీయస్ధాయిలో కాంగ్రెస్ కు మద్దతుగా ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగడతారట. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బిఎస్పీ కలిసి పొత్తుల్లో నుండి కాంగ్రెస్ ను బయటకు తరిమేసినా చంద్రబాబు ఏం చేయలేకపోయారు. ఎవరితో పొత్తులు పెట్టుకున్నా మిత్రపక్షం సంగతి పక్కనపెడితే ఎప్పుడు కూడా చంద్రబాబే లాభపడుతున్నారు. అలాంటిది మొదటిసారి తెలంగాణాలో మిత్రపక్షాలతో పాటు చంద్రబాబు కూడా ఘోరంగా దెబ్బతిన్నారు. మళ్ళీ అదే పరిస్ధితి ఏపిలో కూడా పునరావృతం అవుతుందేమోననే టెన్షనే చంద్రబాబులో ఎక్కువగా కనబడుతోంది. మరి చంద్రబాబు వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సందే.


మరింత సమాచారం తెలుసుకోండి: