తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలాసార్లు వేలుపెట్టిన చంద్రబాబుకి ఇటీవల తెలంగాణ రెండు అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్లు చేసిన ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది.

Related image

ఈ క్రమంలో త్వరలో ఏపీ లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏపీ లోకి వచ్చి మీడియా ముందు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అవినీతిని మరియు చంద్రబాబు యొక్క రాజకీయ ప్రయాణాన్ని గురించి విమర్శలు చేయడం మరొక పక్క వైసీపీ అధినేత జగన్ తో కలిసి జాతీయ రాజకీయాల్లో రాణించాలని అడుగులు వేయటం ఏపీ రాజకీయాన్నే కాదు మరియు తెలంగాణ రాజకీయాన్ని కూడా టిఆర్ఎస్ వేస్తున్న అడుగులు రసవత్తరంగా మార్చింది.

Image result for chandrababu ktr

ఈ నేపథ్యంలో ఇటీవల టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు చేస్తున్న మోసాలను మరియు ప్రకటనలను సంక్షేమ పథకాలను ఏపీ ప్రజలు నమ్మరని. ఎన్నికల వస్తున్న సమయంలో చంద్రబాబు తన బుద్ధిని మళ్లీ బయటపెట్టారని ఈసారి ప్రజలు నమ్మే స్థితిలో లేరు అంటూ పేర్కొన్నారు.

Image result for chandrababu ktr

అంతేకాకుండా రాజకీయాల్లో నుండి చంద్రబాబుకి దిగిపోయే టైం దగ్గరకి వచ్చేసిందని,అందుకనే చాలా హామీలు ఇచ్చేస్తున్నాడని,అందుకే యథాతదంగా మన హామీలకు కాపీ చేసి పేస్ట్ చేసేస్తున్నారని తెలిపారు.మనం ఇక్కడ 2000 ఫించను అంటే ఆయన కూడా 2000 కి మార్చేశారని,అంతే కాకుండా మనం నాలుగు సంవత్సరాల క్రితమే రవాణా శాఖ పన్నుని రద్దు చేస్తే దాన్ని ఇప్పుడు కాపీ చేసేసి అక్కడ ప్రవేశ పెడుతున్నారని, వ్యాఖ్యానించారు. దీంతో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: