గత కొంత కాలంగా అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది.  అక్కడ టీనేజర్స్ గన్ వాడటం కామన్ గా మారడటంతో కొంత మంది ఉన్మాదులు అమాయక ప్రజలపై రెచ్చిపోతున్నారు.  గత మూడు సంవత్సరాల నుంచి పబ్లిక్ పార్క్, హోటల్స్, పబ్, స్కూళ్లలో కొంత మంది ఉన్మాదులు గన్ తో అమాయకులను అన్యాయంగా కాల్చి పడేస్తున్నారు.
Law enforcement officials take cover outside a SunTrust Bank branch, Wednesday, Jan. 23, 2019, in Sebring, Fla. Authorities say theyve arrested a man who fired shots inside the Florida bank. (The News Sun via AP)
తాజాగా అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓ బ్యాంకులో దుండగుడు కాల్పులు జరిపాడు. సెబ్రింగ్‌ నగరంలోని సన్‌ ట్రస్ట్‌ బ్యాంకులోకి వెళ్లిన దుండగుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ఐదుగురు పౌరులు మృతిచెందగా మరికొంత మంది గాయపడ్డారు.
Image result for america florida bank fire
నిందితుడిని సెంబ్రింగ్‌కే చెందిన జీపెన్ జావర్ (21)గా గుర్తించారు.   దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్టు  సెబ్రింగ్‌ పోలీస్‌ అధికారి కార్ల్‌ హోగ్లాండ్‌ తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు.  ప్రాణాలు కోల్పోయిన వారు బ్యాంకు ఉద్యోగులా? ఖాతాదారులా? అనే విషయంలో స్పష్టత లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: