అవును మీరు చదివింది నిజమే. మూడు దశాబ్దాల చరిత్రున్న పార్టీ, నాలుగున్నరేళ్ళుగా అధికారంలో ఉన్న పార్టీకి ఒక పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేయటానికి అభ్యర్ధే దొరకటం లేదంటే ఏమిటర్ధం ? అధికారంలో ఉన్న పార్టీ పరిస్ధితి అంత దయనీయంగా ఉందని తెలిసిపోవటం లేదు. ఇంతకీ ఆ పార్టీ ఏదో ప్రత్యేకించి చెప్పకుండానే అందరికీ అర్ధమైపోయుంటుంది లేండి ఈపాటికే. అవును మీరు ఊహించింది నిజమే టిడిపినే. ఆ నియోజకవర్గం కూడా కడప అనే అందరికీ తెలిసిపోయింది. రాబోయే ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేయటానికి నాలుగున్నరేళ్ళుగా  అభ్యర్ధే దొరకటం లేదు. బూతద్దం పెట్టి చంద్రబాబు ఎంత వెతికినా గట్టి నేతలే దొరకటం లేదంటే టిడిపి పరిస్దితి ఎంత దయనీయంగా ఉందో అర్ధమైపోతోంది.

 

ఈమధ్యనే ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డిని ఎంపిగా పోటీ చేయించేందుకు చంద్రబాబు ఒప్పించినా మంత్రి అడ్డం తిరిగటం విచిత్రంగా ఉంది. చంద్రబాబు ముందేమో పోటీ చేయటానికి ఒప్పుకున్న ఫిరాయింపు మంత్రి జిల్లాకు వెళ్ళిన తర్వాత అడ్డం తిరిగారు. ఓడిపోయే సీటులో ఎవరు పోటీ చేస్తారన్నది మంత్రి వాదన. నిజమే తెలిసి తెలిసి ఓడిపోయే సీటులో ఎవరైనా పోటీ చేస్తారా ? మరి తన పాలనలో రాష్ట్రం బ్రహ్మండంగా అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్నపుడు ఎంపిగా పోటీ చేసేందుకు ఎందుకు వెనకాడుతున్నారు ?

 

ఎందుకంటే, రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోందని మీడియాలో రాయించుకోవటం కాదు. జనాలు అనుకోవాలి. ఆ జనాలేమో చంద్రబాబు పాలనపై మండిపోతున్నారు. క్షేత్రస్ధాయిలో వాస్తవాలు నేతలకు తెలీకుండానే ఉంటుందా ? అందుకనే ఓటమి భయంతోనే ఎంపిగా పోటీ చేసేందుకు భయపడుతున్నారు. అధికారంలో ఉందికదా పోటీ చేసేందుకు ఎవరో ఒకరు దొరక్కపోతారా ? ఎలాగూ పోటీ చేసి ఓడిపోయినా ఎంఎల్సీ సీటును చంద్రబాబు ఎరవేస్తున్నారట. అదెప్పుడు ? పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి మాట కదా ? కడపలో ఓడిపోయి, అధికారంలోకి రాకపోతే ? అప్పుడు రాజెవరో ? రెడ్డెవరో ? చూద్దాం ఏం జరుగుతుందో ?

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: