వంగవీటి రాధా ప్రెస్ మీట్ పెట్టి ఆగ్రహంగా మాట్లాడినాడు. ప్రెస్ మీట్ లో జగన్ వ్యవహార శైలి బాగా లేదని , అందుకే పార్టీ లో నుంచి బయటికి వచ్చానని చెప్పాడు. అయితే మధ్యలో మీడియా, 'మీ సామాజిక వర్గమంతా టీడీపీ వైపుకు వెళుతుందని అనుకుంటున్నారా.?' అని అడిగేసరికి, రాధాకృష్ణలో ఆగ్రహం కట్టలు తెంచేసుకుంది. ఆవేశంతో ఊగిపోయారు. ముందూ వెనుకా ఆలోచించలేదు. బూతులు తిట్టలేదంతే.. ఆ స్థాయిలో ఆగ్రహావేశాలకు లోనయ్యారు రాధాకృష్ణ. నాయకుడనేవాడికి ఎలాంటి లక్షణాలు వుండకూడదో అవన్నీ రాధాకృష్ణలో కన్పిస్తాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?


నిజంగా వంగవీటి రాధా ను జగన్ అంత మాట అన్నాడా .. ప్రెస్ మీట్ లో రాధా ..!

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడే నేతలంతా ఒకటేమాట చెబుతుంటారు.. జగన్‌ దగ్గర తమకు గౌరవం దక్కదని. ఆ విషయాన్నే రాధాకృష్ణ కూడా సెలవిచ్చారు. తనకు వైఎస్సార్సీపీలో అస్సలేమాత్రం గౌరవం దక్కలేదన్నారు. మానసిక క్షోభకు గురిచేశారన్నారు. అవమానాలకు గురిచేశారని చెప్పుకొచ్చారు రాధ. ఇదంతా తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్‌లో భాగమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!


నిజంగా వంగవీటి రాధా ను జగన్ అంత మాట అన్నాడా .. ప్రెస్ మీట్ లో రాధా ..!

రంగా ఆశయాల్ని జనంలోకి తీసుకెళ్ళాలంటే రాజకీయాల్లోనే వుండాలనే రూల్‌ ఏమీలేదంటూ రాధ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఒకింత విస్మయాన్ని కలిగించాయి ఆయన అనుచరులకి. రాధ ఇప్పుడు చెబుతున్నదే నిజమైతే ఇన్నేళ్లూ రాజకీయాల్లో వున్నది ఎందుకట.? అన్ని పార్టీలూ అయిపోయాయి.. చేసేదిలేక, ఇలా సర్దుకుపోవాలనుకుంటున్నారన్నమాట.. అన్న అభిప్రాయం రంగా అభిమానుల్లోనే వ్యక్తమవుతుండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: