వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగా బరిలో దిగాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమిలో చంద్రబాబు చేరినా.. రాష్ట్రంలో మాత్రం టీడీపీ కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోకపోవడం విచిత్రమే. వైసీపీ ఓట్లు చీల్చేందుకే కాంగ్రెస్ ఒంటరి పోరు అన్న విమర్శలు ఉన్నాయి.



ఇదే అంశంపై సాక్షి పత్రిక రాసిన కథనాలపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడుతున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ 175 స్థానాలు పార్లమెంట్ 25 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్తే జగన్ తన సొంత మీడియాలో కేవలం ఓట్లు చీల్చేందుకే పోటీ అని దిగజారుడు కధనాలు రాస్తున్నారని రఘువీరా రెడ్డి అంటున్నారు. తమది జాతీయ పార్టీ అని.. వైసీపీ పిచ్చుక వంటి పార్టీ అంటూ మండిపడ్డారు.

సంబంధిత చిత్రం


రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో బీజేపీకి మద్దతు పలికినందుకు ఎంత సొమ్ము తీసుకున్నారో చెప్పాలని రఘువీరా సవాల్ విసిరారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు కేసీఆర్ నుంచి ఎన్ని కోట్లు తీసుకున్నారని ప్రశ్నించారు. ఇలా అనేక విషయాల్లో అమ్ముడుపోయిన జగన్ తమ పార్టీని ఎలా విమర్శిస్తారన్నారు.



హోదా ఇస్తామని ఘంటాపధంగా చెబుతుతన్న కాంగ్రెస్ పార్టీని నమ్మకుండా.. ఇవ్వంపొమ్మని చెప్పిన బీజేపీని జగన్ ఎలా నమ్ముతున్నారని రఘువీరారెడ్డి ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమికి మద్దతు పెరుగుతుంటే.. ఏ పార్టీ మద్దతు లేని కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు జగన్ మద్దతు పలుకుతారని రఘువీరా విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: