రాజకీయాలంటే పదవులు అన్న సంగతి అందరికీ ఇపుడు అర్ధం అయిపోయింది. ప్రజా సేవా, జనం కోసం అంటూ పెద్ద కబుర్లు ఎవరు చెప్పినా జనం నమ్మడం మానేసి చాలా కాలం అయిపోయింది. మరి గోడ దూకుళ్ళు కూడా అందులో భాగనేనని జనం ఎపుడో  డిసైడ్ అయ్యారు. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు జంప్ చేసినపుడు అభివ్రుధ్ధి కోసం అని చిలక పలుకులు పలికారు. మరి అక్కడ అభివ్రుధ్ధి ఏం జరిగిందో జనాన్ని అడిగితే ఇట్టే చెప్పేస్తారు.


అలిగింది దేనికో :


లేటెస్ట్ పరిణామాలను తీసుకుంటే ఇద్దరు వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడి టీడీపీ వైపుగా అడుగులు వేస్తున్నారు. అందులో ఒకరు నిన్నటి సూపర్ స్టార్ క్రిష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, మరొకరు వంగవీటి రంగా కుమారుడు  రాధాక్రిష్ణ. ఈ ఇద్దరికీ వైసీపీతో సిద్దాంత‌పరంగా భేదం ఏమీ లేదు. రాధా విజయవాడ సెంట్రల్ సీటు కోరుకున్నారు. జగన్ తూర్పు నుంచి పోటీ చేయమన్నారు. అలా కోరిన సీటు కాదన్నందుకు అలిగి ఆయన పార్టీని వీడిపోయారు. ఇక మరో నేత ఆదిశేషగిరిరావు. ఆయన గుంటూరు ఎంపీ టికెట్ వైసీపీని అడిగారు. అయితే జగన్ విజయవాడ ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పారు. నచ్చక ఆయన సైకిల్ ఎక్కబోతున్నారు.


అక్కడ దక్కిందా :


పోనీ అలిగి పార్టీని వీడిపోతున్న ఈ ఇద్దరికీ టీడీపీ ఏమైనా కోరిన సీట్లు ఇస్తుందా అంటే అది ఎక్కడా కనిపించడంలేదు. విజయవాడ సెంట్రల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమ ఉన్నారు. ఆయన్ని కాదని రాధాకు టికెట్ ఇవ్వడం అంటే కుదరని పని. ఇక, గుంటూరులో ఎంపీగా ఆదిశేషగిరిరావు అల్లుడు గల్లా జయదేవ్ ఉన్నారు. మరి అక్కడ ఆయనకు సీటు దక్కదు. దీంతో ఈ ఇద్దరూ ఎమ్మెల్సీలుగా నామినేట్ కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మాత్రం దానికి పార్టీ మారడం ఎందుకో వారే చెప్పాలి. అదేదో జగన్నే అడిగి  నామినేట్ పోస్టులు తీసుకోవచ్చు కదా. పార్టీ మారినా ఏం ఉపయోగం ఉందని ఇలా చేశారన్నది వారి పక్కన ఉన్న వారి మాట. ఇక, ఆదిశేషగిరిరావు విషయం పక్కన పెడితే రాధ బలమైన సామాజికవర్గానికి చెందిన నాయకుడు. ఎంతో ఫ్యూచర్ ఉన్న నేత. అటువంటి నేత ఇలా తొందరపడి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జరిగితే ఇబ్బందులేనని రంగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: