ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మధ్య ఇటీవల ఘర్షణ వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. ఈ పిల్లీ ఎలుకా పోరాటంలో ఇప్పటివరకూ కేసీఆర్ దే పైచేయిగా కనిపిస్తోంది. నోటుకు ఓటు కేసులో ఇరుక్కుపోయిన చంద్రబాబు కేసీఆర్‌కు సరెండర్ అయ్యారన్న అపవాదు ఉంది.



ఓటుకు నోటు కేసు భయానికే చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఉన్నపళంగా అమరావతి వెళ్లిపోయారని పలుసార్లు టీఆర్‌ఎస్ నేతలతోపాటు పలు పార్టీల వారు ఆరోపించారు. తాజాగా తెలంగాణ ఎన్నికల్లోనూ చంద్రబాబు కేసీఆర్ చేతిలో చావుదెబ్బ తిన్నారు. ఈ సందర్భంగానే కేసీఆర్ రిటన్ గిఫ్ట్ ఇస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.



ఇంత జరిగినా చంద్రబాబు మాత్రం కేసీఆర్ పై మాటల యుద్ధం ఆపలేదు. ఏమీ చేయని కేసీఆరే తెలంగాణలో గెలిస్తే మనం గెలవలేమా అంటూ పార్టీ నేతలతో కామెంట్ చేస్తున్నారుకేసీఆర్ ను చేతగాని వ్యక్తిగా తరచూ సొంతపార్టీ నేతలతో చంద్రబాబు కామెంట్ చేస్తూ ఉన్నారు.



ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చేతకాని వ్యక్తి అధికారంలో ఉండాలనేది కేసిఆర్ కోరిక అంటూ మరోసారి చంద్రబాబు కామెంట్ చేశారు. తెలంగాణలో తన చేతకానితనం ఎక్కడ బైటపడుతుందో అన్నదే కేసీఆర్‌ భయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. త్వరలో జగన్ గృహ ప్రవేశానికి కెసిఆర్ ముఖ్యఅతిథిగా వస్తుండటాన్ని ఆయన ఎద్దేవాచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: