టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మరోసారి ఆంధ్రా మీడియాపై ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదేండ్లు గడుస్తున్నా కొన్ని పత్రికలు తీరు మార్చుకోవడం లేదని మండిపడ్డారు. ఇంకా ఆంధ్ర భావజాల ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నాన్ని మార్చుకోవడం లేదని ఘాటుగా కామెంట్ చేశారు.



వాళ్లు ఏం చెప్తే అదే కరెక్ట్.. అదే వేదం అన్నట్టు ప్రవర్తిస్తున్నారని, ఆ ఆధిపత్య ధోరణికి ముగింపు పలుకాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్ అన్నారు. తాము ఎవరితోనూ వివాదాన్ని కోరుకోవటంలేదని, అదే సమయంలో ఎవరిపైనా ఆధిపత్యం చెలాయించాలని కూడా అనుకోవటంలేదని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. మా పుట్టలో వేలుపెడితే..అంటూ గతంలో ఆయన చేసిన కామెంట్లు గుర్తొచ్చాయి.

ktr angry కోసం చిత్ర ఫలితం


తెలంగాణ ఆత్మను నింపుకున్న పత్రికలను ఆదరించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. కచ్చితంగా అలాంటి మీడియాను ప్రోత్సహించి అండగా నిలుస్తామన్నారు కేటీఆర్. ఆంధ్రప్రదేశ్‌కు వంతపాడుతున్న పత్రికల గురించి సీఎం కేసీఆర్ మాట్లాడితే కొంతమందికి కోపం వస్తున్నదని సెటైర్లు వేశారు.

ktr angry కోసం చిత్ర ఫలితం


ఇంకా తెలంగాణ ఎడిషన్లలో అమరావతి వార్తలే రోజు కనిపిస్తున్నాయన్న కేటీఆర్ ఇకనైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. కేటీఆర్ ఇటీవల మీడియాపై మండిపడటం ఇది రెండోసారి. ఆయన తరచూ ఆ రెండు పత్రికలను టార్గెట్ చేస్తున్నారు. మరి ఇదే హెచ్చరికగా భావించాలేమో..


మరింత సమాచారం తెలుసుకోండి: