ఏపీ రాజకీయల్లో కాంగ్రెస్ పార్టీ కుదేల్ అవుతోందా. అంటే సమాధానం అవుననే వస్తోంది. ఆ పార్టీకి సంబంధించి అరకొరగా మిగిలి ఉన్న నాయకులు సైతం తట్టా బుట్టా సర్దుకోవడంతో ఇక  హస్తం  పని అయినట్లేనని అంటున్నారు. కాంగ్రెస్ ఈ దుస్థితిని ఎదుర్కోవడానికి ఆ పార్టీ అగ్ర నాయకత్వమే బాధ్యత వహించాలి.


కలసి అలా..:


ఇక  తెలంగాణా ఎన్నికల ముందు కాంగ్రెస్ కి విజయావకాశాలు బాగా ఉండేవి. అయితే పొత్తుల పేరుతో వచ్చిన చంద్రబాబు టీడీపీతో కలవడం వల్ల కాంగ్రెస్ అక్కడ భారీ మూల్యం చెల్లించుకునిది. టీయారెస్ తో డీ కొట్టే సత్తా కలిగిన కాంగ్రెస్  పొత్తుల పేరుతో చిత్తు అయిపోయింది. గత ఎన్నికల కంటే కూడా ఓట్లు, సీట్లు తక్కువ రావడానికి కారణం టీడీపీ పొత్తు. ఫలితాలు వచ్చిన తరువాత కాంగ్రెస్ నాయకులు దీని మీద వగచి విలపించినా ప్రయోజనం లేకుండా పోయింది.


ఏపీలో ఇలా :


ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా కాంగ్రెస్ మరింత దారుణంగా తయారైంది. నిజానికి టీడీపీతో పొత్తులు లేక ముందు పార్టీ క్యాడర్ లో కొంత నమ్మకం ఉండేది. ఎపుడైతే పొత్తులు ఖరారు అన్నారో అప్పటి నుంచి నాయకులు కూడా ఊహన పల్లకిలో ఊరేగారు.    దాంతో పార్టీని పట్టించుకోవడం మానేసారు. అంతెందుకు ఏకంగా పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెల్లారి లేస్తే చంద్రబాబు నామ స్మరణతో తరించిపోయారు. దాంతో అంతకు ముందు బాబు మీద వేసిన చార్జి షీటు, చేసిన ఆరోపణలతో వచ్చిన కాస్తో కూస్తో మైలేజ్ కాస్తా గాలికి కొట్టుకుపోయింది.  ఇపుడు ఏపీలో పొత్తులు ఉండవని తెలివిగా చంద్రబాబు రాహుల్ గాంధీతో చెప్పి ఆనక  కాంగ్రెస్  నేతల నోట పలికిచేశారు. దాంతో రెండింటికి చెడిన చందంగా కాంగ్రెస్ పరిస్థితి  అయింది.


ఉన్న వారు విడిచి  పోయారు :


టీడీపీతో పొత్తులు అంటూ  అప్పట్లొ ఏపీలో కాంగ్రెస్ చేసిన  హడావుడికి ఇద్దరు మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, సి రామ‌చంద్రయ్య పార్టీని వీడిపోయారు. ఇపుడు పొత్తులు రద్దు చేసుకున్నదుకు నిరసంగా ఏకంగా కోట్ల కుటుంబం టీడీపీలోకి వెళ్ళిపోతోంది. ఆ విధంగా రెండు వైపులా కాంగ్రెస్ కి తీరని నష్టం కలిగిందనే చెప్పాలి. ఇదంతా తెలివిగా చంద్రబాబు వ్యూహం పన్నితే అందుకో చిక్కిన రాహుల్ గాంధి అనుభవలేమిని సూచిస్తోంది. తెలంగాణాలో కాంగ్రెస్ కి గండి కొట్టిన బాబు ఏపీలో మాత్రం ఇంకా దారుణంగా దెబ్బ కొట్టేశారని ఖద్దరు పార్టీ నేతలు ఇపుడు బావురుమంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: