ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ విజయదుంధిబి మోగించింది.  అయితే టి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం, టీజీఎస్,సిపిఐ లతో కలిసి మహాకూటమిగా ఏర్పడి టీఆర్ఎస్ ని ఓడించాలని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజలు మాత్రం అధికార పార్టీ వైపు మొగ్గు చూపారు.  మరోసారి టీఆర్ఎస్ పార్టీనే అత్యధిక మెజార్టీతో గెలిపించారు.   

ప్రస్తుతం తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ విజయకేతనం మొగిస్తుంది.   తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని, ఆ పార్టీకి 16 సీట్లు, ఎంఐఎంకు ఒక్క సీటు దక్కుతాయని, మరే పార్టీకీ రాష్ట్రంలో చోటు లేదని 'రిపబ్లిక్ వరల్డ్ డాట్ కామ్' ప్రకటించగా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 

తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పై ఎంతో నమ్మకాన్ని ఉంచారని..తాము చేసిన అభివృద్ది పనులు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని..ముందు ముందు బంగారు తెలంగాణ వైపు అడుగులు వేయడానికి ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకులు కృషి చేస్తారని అన్నారు.

కాగా, తెలంగాణలో టీఆర్ఎస్ కు 42.4 శాతం ఓట్లు వస్తాయని, యూపీఏకు 29 శాతం ఓట్లు, ఎన్డీయేకు 12.7 ఓట్లు, ఎఐఎంఐఎంకు 7.7 శాతం ఓట్లు, ఇతరులకు 8.2 శాతం ఓట్లు లభిస్తాయని రిపబ్లిక్ వరల్డ్ వెల్లడించింది. లోక్ సభ ఎన్నికలు జనవరిలో జరిగిన పక్షంలో ఈ ఫలితాలు రావచ్చని అంచనా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: