చంద్రబాబునాయుడుకు ధనబలముంటే జగన్మోహన్ రెడ్డికి జనబలముందని వైసిపి చెబుతోంది. వైసిపి నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, ధనబలంతో ఎన్నికలను ఎదుర్కోవాలని చంద్రబాబు వ్యూహం పన్నుతున్నట్లు చెప్పారు. ధనబలంతో రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు ఆ నెపాన్ని వైసిపిపై మోపటం విచిత్రంగా ఉందంటూ మండిపడ్డారు. వైసిపి డబ్బులున్న వారికే టిక్కెట్లు ఇస్తోందని చంద్రబాబు తమపై దుష్ప్రచారం చేయటం ఏంటంటూ నిలదీశారు.

 

అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు, చినబాబు అడ్డదిడ్డంగా డబ్బులు సంపాదించింది వాస్తవం కాదా అంటూ నిలదీశారు. రేపటి ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి రావటం ఖాయమైందని తెలిసే చంద్రబాబుకు చెమటలు పడుతున్నట్లు ఎద్దేవా చేశారు. అందుకనే భోగస్ ఓటర్లను చేర్పించుకుంటున్నట్లు ఆరోపించారు. రేపటి ఎన్నికల్లో వైసిపికి ఓట్లేసేవాళ్ళు ఎవరూ ఉండకూడదనే ఓటర్ల జాబితా నుండి పేర్లను తొలగిస్తున్నట్లు మండిపడ్డారు. ఇప్పటికే చాలా జిల్లాలో ఇటువంటి పనులు చేశారని, తాజాగా విజయనగరంలో పట్టుబడిన టిడిపి కార్యకర్తలే ఇందుకు నిదర్శనమన్నారు.

 

వ్యవస్ధలన్నింటినీ చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నట్లు ఆరోపించారు. ఓటర్లజాబితాలను దగ్గర పెట్టుకుని మరీ వైసిపి సానుభూతిపరులెవరో లెక్కలేసుకుని ఓటర్ల జాబితాలో నుండి వారి పేర్లను తొలగిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలు ఎలాగుంటున్నాయి ? చంద్రబాబు అందంగా ఉంటాడా ? లేకపోతే జగన్మోహన్ రెడ్డి అందంగా ఉంటాడా ? అని అడిగితే జనాలు ఏమని సమాధానం చెబుతారు ? జగన్ అని చెప్పగానే ఓటర్ల జాబితాలో పేర్లు తీసేస్తున్నట్లు వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: