ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని పద్మశ్రీ అవార్డు వరించింది. గేయ రచయిత సిరివెన్నెలతో పాటు మరో ముగ్గురు తెలుగువారికి పద్మ అవార్డులు లభించాయి. చెస్ ప్లేయర్ ద్రోణవల్లి హారిక, ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ ఛత్రి, వ్యవసాయవేత్త యెడ్లవల్లి వెంకటేశ్వర్లు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు.

mohanlal కోసం చిత్ర ఫలితం


రిపబ్లిక్ వేడుకలకు ముందు పద్మ అవార్డులు ప్రకటించడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది మొత్తం నలుగురికి పద్మ విభూషణ్, 14 మందికి పద్మభూషణ్, 94 మందికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. రచయిత బల్వంత్ పురందరే, ఎల్‌ అండ్ టీ ఛైర్మన్ అనిల్‌ కుమార్, జిబూటీ అధ్యక్షుడు ఇస్మాయిల్ ఒమర్, జానపద కళాకారిణి తీజన్ బాయ్ లకు పద్మ విభూషణ్ దక్కాయి.

prabhu deva కోసం చిత్ర ఫలితం


పద్మభూషణ్ అవార్డు పొందిన వారిలో ప్రముఖ పాత్రికేయుడు కుల్దీప్ నయ్యర్, అమెరికన్ ట్రేడ్ ఇండస్ట్రీకి చెందిన జాన్ చాంబర్స్, హర్యానా సామాజిక వేత్త దర్శన్‌ లాల్ జైన్ మొదలైనవారు ఉన్నారు. నటుడు, డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా కూడా పద్మశ్రీకి ఎంపికయ్యారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ కూడా పద్మ అవార్డులు వచ్చిన వారిలో ఉన్నారు. , మళయాల సూపర్ స్టార్ మోహన్‌ లాల్‌ కు పద్మ భూషణ్ అవార్డు దక్కింది.

dronavalli harika కోసం చిత్ర ఫలితం


తెలుగువారిలో సిరివెన్నెల పాటల రచయితగా దశాబ్దాలపాటు తెలుగు సినీరంగానికి సేవలు అందించారు. ద్రోణవల్లి హారిక ప్రపంచ చెస్ రంగంలో రాష్ట్రానికి పేరు తీసుకువచ్చారు. యెడ్లవల్లి వెంకటేశ్వర్లు రైతు నేస్తం సంస్థను స్థాపించి వ్యవసాయ రంగంలో సేవలు అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: