మోదీ కొత్త బడ్జెట్ ఎలా ఉండబోతోంది. నాలుగున్నరేళ్ల మోడీ పాలన అంత సంతృప్తికరంగా లేనందువల్ల ఈసారి బడ్జెట్ ద్వారానైనా ప్రజలను ఆకట్టుకునే ఉద్దేశ్యం మోడి సర్కారుకు కనిపిస్తోంది. ఓట్లు రాల్చేందుకు అవకాశం ఉన్న దేన్నీ ఆయన వదలడం లేదు.

real estate in hyderabad కోసం చిత్ర ఫలితం


కాబట్టి మోడీ బడ్జెట్‌లో ఈసారి సానుకూల అంశాలు ఎక్కువగా ఉండే ఛాన్సులు ఉన్నాయి. సాధారణంగా ఎన్నికలకు ముందు వెళ్లే బడ్జెట్‌లో విధాన నిర్ణయాలు ఉండకూడదు. కానీ ఈసారి ఈ రూల్ బ్రేక్ చేయబోతున్నారు. ఇక రియల్ ఎస్టేట్‌ రంగానికి ఈ బడ్జెట్ ఊతమిచ్చే ఛాన్స్ ఉంది.

real estate in hyderabad కోసం చిత్ర ఫలితం


ఆదాయ పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచే అవకాశాలు ఉన్నందువల్ల ఇది రియల్ ఎస్టేట్‌కు పాజిటివ్ అవుతుంది. పన్ను ఊరట కలిగిన వేతన జీవులు.. ఆ మొత్తాన్ని రియల్ ఎస్టేట్‌ లో పెట్టుబడి పెట్టే అవకాశాలు పెరుగుతాయిహోమ్‌లోన్‌ అసలు, వడ్డీపై ప్రస్తుతం లక్షన్నర, 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి. అలాగే పేదలు, అందుబాటు గృహాలు నిర్మించే బిల్డర్లకు ఆదాయపు పన్నులో మినహాయింపు ఉంది. దీన్ని కొనసాగించే ఛాన్స్ ఉంది.

indian public కోసం చిత్ర ఫలితం


మోడీ సర్కారు గతంలో ప్రకటించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన రుణ ఆధారిత పథకం అమలులో విఫలమవుతోంది. దీనికి నిధులు సరిగ్గా కేటాయించలేదు. కానీ ఈ ఏడాది నిధులు కేటాయిస్తే రియాల్టీకి బూమ్ వచ్చే ఛాన్సుంది. గృహరుణాలపై జీఎస్టీ తగ్గించే అవకాశం కూడా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: