జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వింటుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయ్. అవినీతికి పాల్పడి డబ్బులు సంపాదించే అవకాశాలు లేవన్న ఉద్దేశ్యంతోనే కొందరు నేతలు జనసేనలోకి రావటానికి ఇష్టపడటం లేదట.  జనసేనకున్న యువశక్తిని, మహిళాశక్తిని రాజకీయ శక్తిగా గుర్తించటానికి ఇతర పార్టీల్లోని నేతలు ఇష్టపడటం లేదంటున్నారు. ఇంకో రెండు విషయాలు కూడా చెప్పారండోయ్. జనసేనలోని నాయకులు పగలు పవన్ తోను రాత్రి వేరే పార్టీలతో టచ్ లో ఉన్నారట. ఆ విషయాన్ని పవనే స్వయంగా చెప్పటం విశేషం. పవన్ ను, పవన్ నమ్మకాన్ని, జనసేనను పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లో ఎదగాలనుకుంటే ఊరుకునేది లేదని పెద్ద వార్నంగే ఇచ్చారు.

 Image result for janasena images

పవన్ తాజా మాటలు వింటుంటే ఎంత గందరగోళంలో ఉన్నారో అర్ధమైపోంది. రాజకీయాల్లోకి వచ్చే ప్రతీ ఒక్కరు చెప్పేది ప్రజాసేవే అయినా పరమార్ధం మాత్రం సొంతలాభమే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఎవరో అవసరం లేదు మెగాస్టార్, పిఆర్పి అధ్యక్షుడు చిరంజీవే క్లాసిక్ ఎగ్జాంపుల్.  తాను పార్టీ పెట్టేయగానే పోలోమంటూ ఇతర పార్టీల నుండి నేతలు వచ్చి జనసేనలో చేరిపోతారని పవన్ అనుకున్నారు. అయితే, పార్టీ పెట్టి ఐదేళ్ళవుతున్నా జనసేన అంటే పవన్ తప్ప చెప్పుకోతగ్గ రెండో నేతే కనబడలేదు. ఇదంతా కేవలం పవన్ స్వయంకృతమనే చెప్పుకోవాలి.

 Related image

పవన్ నుండి జాలువారిన ఆణిముత్యాలు చాలానే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయాలని జనసేన పెట్టలేదని ఒకసారన్నారు. అధికారంలోకి రావటమే జనసేన పరమార్ధం కాదన్నారు. ప్రజలకు సేవచేయటానికి అధికారమే అవసరం లేదన్నారు. అధికారం అనుభవించాలని అనుకునే వారికి తన పార్టీలో చోటులేదన్నారు. తనకు అధికారం అప్పగిస్తే ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరించేస్తానని మరో సందర్భంలో చెప్పారు. ముఖ్యమంత్రి కావటం కోసమే జగన్ వైసిపిని పెట్టినట్లు దెప్పి పొడిచారు. జగన్ కున్న అధికార యావ తనకు లేదన్నారు.

 Image result for janasena images

ఇలా తడవొకు ఒక మాట మాట్లాడుతుంటే పవన్ లో స్దిరత్వం లేదన్న విషయం స్పష్టమైపోయింది. తెలంగాణా ఎన్నికల గురించి మాట్లాడుతూ ఎన్నికల్లో పాల్గొనేందుకు తమ పార్టీ ఇంకా రెడీ కాలేదని ప్రకటించటంతో అందరూ ఆశ్చర్యపోయారు. రేపు ఇదే మాట ఏపి ఎన్నికల సమయంలో కూడా అనరని గ్యారెంటీ ఏమిటనే అనుమానం అందరిలోను మొదలయ్యింది. అందుకనే ఇతర పార్టీల నుండి నేతలు జనసేనలో చేరటానికి పెద్దగా ఆసక్తి చూపటం లేదు.

Related image

నిజానికి కాపులను నమ్ముకునే పవన్ పార్టీ పెట్టారన్నది వాస్తవం. అయితే, పవన్ వైఖరి చూసిన తర్వాత కాపుల్లో పెద్ద నమ్మకం కనబడినట్లు లేదు. అందుకనే కాపు నేతల్లో కూడా ఎవరు జనసేన వైపు చూడటం లేదన్నది నిజం. ఆ కారణంగానే ప్రధాన పార్టీలైన టిడిపి, వైసిపి కాపు నేతలు కూడా జనసేనలో చేరలేదు. ఎందుకంటే, ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత జనసేన 2019లో కాదు 2024 ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.




మరింత సమాచారం తెలుసుకోండి: