భారత దేశాన్ని రెండు వందల సంవత్సరాలు బ్రిటీష్ పాలనలో ఎన్నో కష్టాలు అనుభవించింది. వర్తక వ్యాపారం చేస్తామని వచ్చినవారు..తర్వాత భారతీయు లపై పెత్తనం చెలాయిస్తూ నరకం చూపించారు.  మన దేశ సంపద కొల్లగొట్టుకు పోయారు.  దాంతో ఎంతో మంది త్యాగధనులు భారత మాత దాస్య శృంఖలాలకు విముక్తి కలిగించేలా పోరాడారు. ఫలితంగా 1947 ఆగస్టు 15 న భారత దేశానికి స్వాతంత్రం వచ్చింది.  అప్పటి వరకు బ్రిటీష్ పాలనలో ఉన్న మనం మన స్వపరిపాలన కోసం ఏర్పాటు చేసుకున్నాము. 


భారతదేశంలో గణతంత్ర దినోత్సవము మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 దినానికి గౌరవంగా జరుపు కుంటారు. ఈ రోజున బ్రిటీషు కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పాటయింది.  అప్పటి నుంచి భారత దేశంలో రెండు సార్లు జాతీయ పండుగ చేసుకుంటున్నాం.  అయితే గత కొంత కాలంగా జాతీయ జెండాకు ఎన్నో అవమానాలు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.


తాజాగా  వందేళ్లకు పైగా చరిత్ర కలిగి, ఎంతో ఘనత వహించిన ఉస్మానియా యూనివర్శిటీలో... గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాకు తీరని అవమానం జరిగింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్ పై యూనివర్శిటీ అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. అయితే ఆ జెండా మద్యలో చిరిగి ఉండటం కలకలం రేపింది. విద్యావంతులైన అధికారులు జాతీయ జెండాకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా చిరిగిన విషయం గమనించకుండా ఎలా ఎగుర వేస్తారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇది గమనించిన అధికారువు వెంటనే కొత్త జండా తెప్పించి ఎగురు వేసి తమ తప్పును దిద్దుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు, రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లు కూడా సరిగా లేవంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: